మిత్రమా… జర భద్రం!

ఓ ఉమ్మడి కుటుంబంలో ముద్దుల మనవరాలు ఆ పాప. కొత్తగా పెద్ద స్కూల్లో చేరింది. ఆమె సంబరాన్ని అమ్మతోపాటు తాతయ్యా, ఇద్దరు బాబాయిలూ పంచుకోవాలనుకున్నారు. బడి కాగానే కారులో ఇంటికి తీసుకొస్తూ పాప చెప్పే కబుర్లు నవ్వుతూ వింటున్నారు. ఆ మూడుతరాల వారి మురిపెం మర్నాడు పత్రికల్లో పతాకశీర్షిక అవుతుందని వారికి తెలియదు. ఒకే ఒక్క క్షణం… ఏం జరిగిందో తెలియకుండానే ఒక ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఆస్పత్రిలో పదిరోజులు మృత్యువుతో పోరాడి ఆ పసిప్రాణమూ ఓడిపోయింది. అది విని అప్పుడే గాయాల నుంచి కోలుకుంటున్న తాత గుండె ఆగిపోయింది. జరిగినదాంట్లో వారి తప్పేం లేదు. ఎక్కడినుంచో దూసుకొచ్చిన మరో కారు వారి కారు మీద పడింది. మొత్తం కుటుంబమే తలకిందులైపోయింది.

old lady crying by seeing his son died on accident

old lady crying by seeing his son died on accident

‘అన్నయ్య స్కూలుకు వెళ్తున్నాడు. టాటా చెబుదాం రమ్మ’ంటూ రెండేళ్ల బుడతడిని చంకనేసుకుని రోడ్డు మీదికి వచ్చింది ఓ తల్లి. స్కూలు బస్సెక్కుతున్న కొడుక్కి బ్యాగు అందించడానికి చంకలో పిల్లాడిని కిందికి దించింది. పుస్తకాల సంచీ, టిఫిన్‌ డబ్బా అందించి, జాగ్రత్తలన్నీ చెప్పి, కొడుకు లోపలికి వెళ్లి కూర్చునేదాకా కళ్లనిండుగా చూసుకుని టాటా చెప్పింది. బస్సు కదిలింది. అంతలోనే ఏదో చప్పుడు… చూస్తే బస్సు చక్రం కింద నలిగి రక్తపు మడుగులో చిన్న కొడుకు. ఆ తల్లి గుండె చెరువయ్యింది.

రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడడం తమకెటూ తప్పలేదు. పిల్లలనైనా బాగా చదివించాలనుకున్నారు ఆ పల్లెల్లోని తల్లిదండ్రులు. పట్టణంలోని ఇంగ్లిష్‌ మీడియం కాన్వెంట్‌లో చేర్పించారు. రోజూ పొద్దున్నే లేచి వంటలు చేసి టిఫిన్లు సర్ది బస్సెక్కించేవారు. తాము పొలాలకు వెళ్తూ రేపు బిడ్డలు పెద్దవాళ్లయి చేయబోయే ఉద్యోగాల గురించి ఎన్నో ఊహలల్లుకునేవారు. రైలు రూపంలో మృత్యుదేవత పొంచిఉందనీ తమ చిట్టితండ్రులు మాంసపు ముద్దలుగా తిరిగొస్తారనీ కలలో కూడా అనుకోలేదు. కన్నుమూసి తెరిచేలోపు పాతిక పసిప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

దేవుడి దర్శనానికని కొందరూ, రకరకాల పనుల మీద కొందరూ త్వరగా ఊరు చేరాలని బస్సెక్కారు. చోటు లేకున్నా సర్దుకున్నారు. తప్పదు మరి. ఉద్యోగాలకీ కాలేజీలకీ వెళ్లే సమయమూ అదే… అందరికీ పనులవ్వాలి. అందుకే అందరూ ఆ బస్సే ఎక్కారు. కానీ అది వారిని గమ్యం చేర్చలేదు. రోడ్డు మీదినుంచి లోయలోకి దూసుకెళ్లి ఏకంగా పైలోకాలకే పంపేసింది. ఒకటీ రెండూ కాదు… డెబ్బై కుటుంబాలు గుండెలు బాదుకుని ఏడ్చాయి. ఏం లాభం? పోయిన ప్రాణం తిరిగిరాదని వారికీ తెలుసు.

road accident

road accident

ఆఫీసుకు టైమైపోతోంది. ట్రాఫిక్‌ని తప్పించుకుంటూ నేర్పుగా బండి నడుపుతూ వెళ్తుంటే జేబులో సెల్‌ మోగింది. ఎవరు చేశారో ఎందుకు చేశారో- ఓ చేత్తో బండి నడుపుతూ మరో చేత్తో ఫోను తీసి భుజానికీ మెడకీ మధ్య ఇరికించి వంచిన తలతో వంకరగా రోడ్డును చూస్తూ స్నేహితుడికి సాయంకాలం కలుసుకుంటానని హామీ ఇస్తూండగా జరిగిందది… అంతే. మరో గంట తర్వాత విరిగిన కాళ్లూ చేతులతో వంటి మీద స్పృహలేకుండా ఆస్పత్రి మంచం మీద ఉండాలా పోవాలా అంటూ కొట్టుమిట్టాడుతోంది ప్రాణం.

మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి . . . ! (కింద నంబర్స్ పేజెస్ ఉన్నాయా ఐతే ఇంకా చదవండి క్లిక్ చేయండి )
 •  
 • 19
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  19
  Shares