మిత్రమా… జర భద్రం!

సాయం చేసేవారేరీ!

ప్రమాదానికి మనం కారణం కాకుండా ఉండడమే కాదు, ఎవరికైనా ప్రమాదం జరిగితే స్పందించడమూ సమాజంలో పౌరులుగా మన బాధ్యతే. ఈ విషయంలోనూ మన స్పందన అంతంతమాత్రమే. ఇటీవలే దిల్లీలో ఓ కాలేజీ విద్యార్థి ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సహాయం కోసం అభ్యర్థిస్తే ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఆ సంఘటన వీడియో సోషల్‌ మీడియాకెక్కింది. అలాంటిదే మరో సంఘటన బెంగళూరులోనూ జరిగింది. సైకిల్‌ మీద వెళ్తున్న ఓ కుర్రాడిని బస్‌ ఢీకొంటే రక్తపుమడుగులో ఆ అబ్బాయి దాదాపు అరగంటసేపు నరకం అనుభవించాడు. తనని ఆస్పత్రికి తీసుకెళ్లమంటూ అక్కడున్నవారికి దండాలు పెట్టాడు. ఎవరూ ముందుకు రాలేదు.

rtc bus accident

rtc bus accident

పోలీసులు వచ్చేసరికి ప్రాణం పోయింది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడున్నవారో, ఆ టైములో ఆ రోడ్డు మీద వెళ్తున్నవారో ఎవరో ఒకరు ఆ పిల్లాడిని ఆస్పత్రికి తీసుకెళ్లుండవచ్చు, కనీసం ఫోన్‌ చేసి పోలీసులకో, అంబులెన్సుకో సమాచారం ఇచ్చివుండవచ్చు. అవేమీ చేయకుండా వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పెట్టడంతో ప్రమాదబాధితులకు సహాయం అందించడంలో సమాజం ఎందుకు వెనకంజ వేస్తోందన్న విషయం చర్చల్లోకి వచ్చింది. మనదేశంలో 76 శాతం ప్రజలు ప్రమాద బాధితులకు సాయం చేయడానికి ముందుకు రావడం లేదంటే అందుకు కారణం- పోలీసు కేసు అవుతుందనీ, కోర్టుల చుట్టూ తిరగాల్సివస్తుందనీ భయపడడమే. ప్రమాదం జరిగిన తర్వాత తొలి గంట చాలా కీలకం. ఆ సమయంలో వైద్యం అందితే ప్రాణాలు నిలిచే అవకాశాలు పెరుగుతాయి. శాశ్వతవైకల్యం సంభవించే ప్రమాదమూ తగ్గుతుంది.

 

 

పదినిమిషాలు… మూడు ప్రాణాలు

‘ఇదిగో, పదినిమిషాల్లో అక్కడుంటా…’ అని ఫోనులో చెబుతూ రయ్‌న దూసుకుపోతుంటారు చాలామంది. ప్రయాణ సమయం దూరాన్నీ ట్రాఫిక్‌నీ బట్టి ఉంటుంది. వేగంతో వాటిని అధిగమించాలనుకోవడమే చాలామంది చేస్తున్న పొరపాటు. మనదేశంలో నిమిషానికో ప్రమాదం జరుగుతుంటే ఆ ప్రమాదాల వల్ల మూడు నిమిషాలకో ప్రాణం గాలిలో కలిసిపోతోంది. అనుకున్న టైముకన్నా పదినిమిషాలు ముందుగా వెళ్లామా పావుగంట ఆలస్యంగా వెళ్లామా అన్నది కాదు, క్షేమంగా ఇంటికెళ్తామా అన్నదే ప్రధానం.

auto accident

auto accident

ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పలు స్వచ్ఛంద సంస్థలు కృషిచేస్తున్నాయి. సేవ్‌లైఫ్‌ ఫౌండేషన్‌, ఎరైవ్‌ సేఫ్‌, ముస్కాన్‌ ఫౌండేషన్‌, సేఫ్‌రోడ్‌ ఫౌండేషన్‌… తదితర సంస్థలు చెప్పుకోదగ్గ స్థాయిలో కృషిచేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకూ, మరణాలను తగ్గించడానికీ రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. బాధితులకు ప్రథమచికిత్స అందించడంలో వలంటీర్లకూ, పోలీసులకూ శిక్షణ ఇస్తున్నాయి. కొత్త చట్టాల రూపకల్పనకూ దారిచూపుతున్నాయి. జాతీయ రహదారులపై 500మీటర్ల పరిధిలో మద్యం దుకాణాలు ఉండకూడదన్న సుప్రీంకోర్టు తీర్పు, కర్ణాటక ప్రభుత్వం తెచ్చిన ‘గుడ్‌ సమరిటన్‌ అండ్‌ మెడికల్‌ ప్రొఫెషనల్‌ బిల్‌ 2016’ లాంటివి అలా వచ్చినవే. కర్ణాటక ప్రభుత్వం తెచ్చిన బిల్లు వల్ల ప్రమాదబాధితులకు సకాలంలో సహాయం అందుతుంది. బాధితులకు సహాయపడేవారు కోర్టులూ పోలీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. వారిని ఆస్పత్రికి చేర్చి తమ దారిన తాము వెళ్లిపోవచ్చు. ఈ చట్టంకింద ఆస్పత్రులు కూడా వెంటనే చికిత్స అందించాలి. కేసు నమోదు చేసేదాకా చికిత్స ఆపకూడదు. దిల్లీ ప్రభుత్వం మరో రకంగా ప్రయత్నిస్తోంది. ప్రమాద బాధితులకు సాయం చేసేవారికి రూ. 2000 ప్రోత్సాహక బహుమతినీ, ఓ ప్రశంసాపత్రాన్నీ ఇస్తోంది. ఇలాంటి చట్టాల్ని ప్రతి రాష్ట్రమూ చేస్తే, ప్రజలు భయాలను వదిలి సానుభూతితో స్పందిస్తే ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయేవారి సంఖ్య గణనీయంగా తగ్గుతుంది.

* * *

కొత్త బండీ స్నేహితులిచ్చే హుషారూ రోడ్డుమీద వాహనాలన్నిటినీ కట్‌ కొట్టి యువతని ముందుకు దూసుకుపొమ్మంటాయి.
వెళ్లాల్సిన దూరమూ చెయ్యాల్సిన పనులూ మనసును తొలిచేస్తూ స్టీరింగ్‌ మీద ఉద్యోగస్తుల చేతులను స్పీడోమీటర్‌తో పోటీపడమంటాయి.
విశ్రాంతి లేని పనీ రోజుల తరబడి కుటుంబానికి దూరంగా ప్రయాణాల్లో గడపడమూ డ్రైవర్లని నిస్పృహకి గురిచేస్తాయి.
‘కొనుక్కున్న’ లైసెన్సులూ కాలం చెల్లిన వాహనాలూ ప్రయాణికుల్నే కాదు రోడ్డు మీద ఉన్నవారినీ మింగేస్తాయి.
వద్దు… రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయినవారి సాక్షిగా ఈ పరిస్థితుల్ని మార్చుకుందాం.
భద్రంగా ప్రయాణాలు చేద్దాం!

మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి . . . ! (కింద నంబర్స్ పేజెస్ ఉన్నాయా ఐతే ఇంకా చదవండి క్లిక్ చేయండి )
 •  
 • 19
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  19
  Shares