మిత్రమా… జర భద్రం!

 

60 శాతం యువతే!

రో డ్డు ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నవాళ్లలో 60 శాతం 18-35 మధ్య ఉన్న యువతే. ఆ తర్వాత స్థానం 45-60 మధ్య వయస్కులది. మొత్తమ్మీద ప్రమాదాల్లో మరణిస్తున్నవారిలో 87శాతం సంపాదించే వయసులో ఉన్నవారే.
ఇక, బాధితుల్లో సగం మంది రోడ్డుమీద నడుస్తున్నవాళ్లూ, సైక్లిస్టులూ, ద్విచక్రవాహనం నడుపుతున్నవాళ్లే.

వేగం… వేగం…

రో డ్డు ప్రమాదాలకు కారణమవుతున్న మొదటి ముద్దాయి అతివేగమే. 2016లో జరిగిన ప్రమాదాలను విశ్లేషిస్తే 73,896 మరణాలు అతివేగం వల్ల సంభవించిన ప్రమాదాల్లో జరిగినవే. సగటు ప్రయాణ వేగం గంటకు కిలోమీటరు చొప్పున తగ్గినా చాలు- ప్రమాదాలు 3 శాతం తగ్గుతాయి.
ఆ తర్వాత కారణమూ వాహనం నడిపేవారు చేసిన పొరపాట్లే. హెల్మెట్‌ పెట్టుకోకపోవడమూ, ఓవర్‌టేకింగూ, సీటు బెల్టు పెట్టుకోకపోవడమూ లాంటివి.

పదేళ్లలో… 14 లక్షలు

మ న దేశంలో గత పదేళ్లలో రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోయినవారు 13,81,314 మంది.
* ప్రమాదాల్లో గాయపడి వైకల్యంతో బతుకుతున్నవారు 50,30,707 మంది.

ఏటా లక్షన్నర మంది

2016 లో 4,80,652 ప్రమాదాలు జరగ్గా 1,50,785 మంది ప్రాణాలు కోల్పోయారు.
* 2017లో 4,64,910 ప్రమాదాలు జరగ్గా 1,47,913 మంది ప్రాణాలు కోల్పోయారు.

నంబర్‌ వన్‌ ఉత్తరప్రదేశ్‌

దే శంలో రోడ్డు ప్రమాదాల్లో తమిళనాడు మొదటి స్థానంలో ఉంటే మరణాల్లో మాత్రం ఉత్తరప్రదేశ్‌ ప్రథమస్థానాన్ని ఆక్రమిస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ఏడో స్థానంలో, తెలంగాణ 9వ స్థానంలో ఉన్నాయి.
నగరాల్లో దిల్లీది ప్రథమస్థానం. చెన్నై, జైపూర్‌, బెంగళూరు తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

ద్విచక్రవాహనాలదే పెద్ద వాటా

రో డ్డు ప్రమాదాల్లో మూడో వంతు మరణాలకు ద్విచక్రవాహన ప్రమాదాలే కారణం. కార్లూ జీపులది రెండో స్థానం. మూడో స్థానంలో ట్రక్కులూ ట్రాక్టర్లూ, నాలుగో స్థానంలో బస్సులూ ఉన్నాయి.

ఇలా చేస్తే…

డ్రం క్‌ అండ్‌ డ్రైవ్‌ చట్టాలను సరిగ్గా అమలుచేస్తే 20శాతం ప్రమాదాలు తగ్గుతాయి.
* హెల్మెట్‌ వాడకం వల్ల తలకి తీవ్రగాయమై సంభవించే మరణాల్ని 45 శాతం తగ్గించవచ్చు.
* šసీట్‌బెల్టుని సరిగ్గా వినియోగిస్తే కారు ప్రమాదాల్లో 61 శాతం మరణాలు తగ్గుతాయి.

రహదారులకూ కథలుంటాయి…

రో డ్డు ప్రమాద బాధితులను గుర్తు చేసుకుంటూ ఓ రోజును నిర్వహించడాన్ని 1993లో ఇంగ్లండ్‌లోని ఓ స్వచ్ఛంద సంస్థ ప్రారంభించింది. క్రమంగా దీన్ని యూరోప్‌ అంతటా అమలుచేయడం మొదలెట్టారు. ఇలాంటి ఓ రోజు ఉండాల్సిన అవసరాన్ని గుర్తించిన ఐక్యరాజ్యసమితి ఏటా నవంబరులోని మూడో ఆదివారాన్ని రోడ్డు ప్రమాద బాధితుల సంస్మరణ దినంగా నిర్వహించాలని 2005లో ప్రకటించింది. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయినవారికి నివాళులర్పించడంతో పాటు, ప్రమాదాలను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడానికి ఏటా ఒక అంశాన్నీ ఎంపిక చేస్తోంది. ఈ ఏడాది ఎంచుకున్న అంశం- ‘రోడ్స్‌ హావ్‌ స్టోరీస్‌’.

మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి . . . ! (కింద నంబర్స్ పేజెస్ ఉన్నాయా ఐతే ఇంకా చదవండి క్లిక్ చేయండి )
 •  
 • 19
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  19
  Shares