Bala Saibaba death – బాలసాయిబాబా కన్నుమూత

Bala Saibaba death – బాలసాయిబాబా కన్నుమూత

 

కర్నూలు ప్రాంతానికి చెందిన ఆధ్యాత్మిక గురువు బాలసాయిబాబా ఈ రోజు ఉదయం హైదరాబాదులోని విరంచి ఆసుపత్రిలో మరణించారు. ఆశ్రమంలో ఉండగానే ఆయనకు నిన్న అర్థరాత్రి గుండెపోటు రావడంతో.. తనను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ రోజు ఉదయం ఆయన మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు ధ్రువీకరించాయి. 58 సంవత్సరాల బాల సాయిబాబా కర్నూలులో ఓ ట్రస్టు నడుపుతున్నారు. పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు బాల సాయిబాబాకి శిష్యులుగా ఉన్నారు. కేంద్ర మంత్రి రామ్ క్రిపాల్ యాదవ్ లాంటి వారు కూడా గతంలో బాలసాయిబాబా ఆశ్రమాన్ని సందర్శించడంతో ఆయన బాగా పాపులర్ అయ్యారు.

 

Bala Saibaba death

 

Bala Saibaba death

Bala Saibaba death

 

అయినప్పటికీ ఆయనపై పలు పత్రికలు గతంలో వివాదాస్పదమైన కథనాలు ప్రచురించాయి. నోటిలో నుండి శివలింగాలు తీసి భక్తులకు అందజేయడం బాలసాయిబాబా స్పెషాలిటీ. తనను తాను కమ్యూనిస్టు దేవుడినని ప్రచారం చేసుకున్న బాలసాయిబాబా గతంలో సాక్షాత్తు తిరుపతి వెంకటేశ్వరస్వామిపై కూడా ఆరోపణలు చేశారు.

 

కళింగ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా బాల సాయిబాబా పనిచేశారని గతంలో పలు వార్తలు వచ్చాయి. 14 జనవరి 1960 తేదిన కర్నూలులో జన్మించిన బాల సాయిబాబా తాను రమణ మహర్షి బోధనలతో ప్రభావితమై ఆధ్యాత్మిక రంగంలోకి వచ్చినట్లు పలుమార్లు తెలిపారు. కామన్వెల్త్ ఓకేషనల్ యూనివర్సిటీ నుండి బాలసాయిబాబా డాక్టరేటు పొందినట్లు ఆయన వెబ్ సైటులో పేర్కొనడం జరిగింది. బాలసాయిబాబా కర్నూలుతో పాటు హైదరాబాద్‌లో కూడా ట్రస్టును నిర్వహిస్తున్నారు. అలాగే పలు ఆలయాలు కూడా నిర్మించారు.

 


కర్నూలు జిల్లాకు చెందిన బాలసాయిబాబా కన్నుమూశారు. గుండెపోటుతో బంజారాహిల్స్లోని విరించి ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. బాల సాయిబాబా ఎంత పేరు ప్రఖ్యాతులు గడించారో, అంతగానూ వివాదాస్పదుడయ్యారు. అయినప్పటికీ బాల సాయిబాబాకు కర్నూలు జిల్లాలోనూ, రాష్ట్రవ్యాప్తంగానూ అనేకమంది భక్తులున్నారు. 1960 జనవరి 14న కర్నూలులో అయన జన్మించారు. చిన్నతనం నుంచే శ్రీ రమణ మహర్షి బోధనలతో ఆథ్యాత్మికత వైపు మళ్లినట్టు ఆశ్రమవాసులు అంటుంటారు. తన 18వ ఏట ఆశ్రమాన్ని స్థాపించిన ఆయన బోధనల పట్ల ఎంతో మంది ఆకర్షితులయ్యారు. ప్రతియేటా మహాశివరాత్రి నాడు తన నోటి నుంచి శివలింగాలు తీస్తూ పేరు తెచ్చుకున్నారు. గతంలో ఈ ఉత్సవాలు ఘనంగా జరిగేవి. మరోవైపు బాలసాయిబాబా అనేక వివాదాలలో మునిగిపోయారు. గుప్త నిధుల తవ్వకాలు, భూమిని ఆక్రమించారన్న ఆరోపణలు వచ్చాయి. ట్రస్ట్ పేరుతో భారీగా ఆస్తులు కూడగట్టారని కుడా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.తనదైన ప్రవచనాలతో భక్తులను ఆయన విశేషంగా ఆకట్టుకునేవారు. బాలసాయి మృతి వార్త విని ఆయన అనుచరులు కంటతడి పెట్టారు. కర్నూలు ప్రాంతంలో పాఠశాలలు, రహదారులు వంటి మౌలిక వసతులు కల్పించడంలో నిధులిచ్చిన ఆయనకు డాక్టర్ ఆఫ్ డివైనిటీ, అంబాసిడర్ ఆఫ్ పీస్, హాననరీ డిగ్రీ ఆఫ్ డాక్టర్ ఆఫ్ లాస్, హానరరీ డిగ్రీ ఆఫ్ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ లాంటి గౌరవాలు దక్కాయి

మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి . . . ! (కింద నంబర్స్ పేజెస్ ఉన్నాయా ఐతే ఇంకా చదవండి క్లిక్ చేయండి )
 •  
 • 16
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  16
  Shares