Butta bomma trailer: బుట్టబొమ్మ ట్రైలర్ రివ్యూ… వేటగాడి కంట్లో పడ్డ ప్రేమ జంట, అదే కీలక ట్విస్ట్!

Telugu January 29, 2023
మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

Butta Bomma Trailer Review: ఒక ప్రక్క స్టార్ హీరోలతో భారీ చిత్రాలు నిర్మిస్తూనే కంటెంట్ ఉన్న చిన్న చిత్రాలను నిర్మాత నాగవంశీ తెరకెక్కిస్తున్నారు. యంగ్ టాలెంట్ ని ఆయన ప్రోత్సహిస్తున్నారు. ఈ మధ్య కాలంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కిన డీజే టిల్లు, స్వాతి ముత్యం మంచి విజయాలు సాధించాయి. డీజే టిల్లు అయితే భారీ లాభాలు తెచ్చిపెట్టింది. తాజాగా ఈ బ్యానర్ లో బుట్టబొమ్మ టైటిల్ తో ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ తెరకెక్కించారు. అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ట జంటగా నటిస్తున్నారు. ఖైదీ, మాస్టర్ ఫేమ్ అర్జున్ దాస్ మరో ప్రధాన రోల్ చేశారు. సీరియల్ నటి నవ్య స్వామి మరో పాత్రలో నటించారు.

Butta bomma movie – Butta bomma trailer

బుట్టబొమ్మ చిత్రం విడుదలకు సిద్దమైన నేపథ్యంలో ట్రైలర్ విడుదల చేశారు. రెండు అమాయకపు మనసుల మధ్య స్వచ్ఛమైన ప్రేమ చిగురిస్తుంది. సంతోషంగా సాగుతున్న వారి ప్రేమకథలోకి ఊహించని విలన్ అడుగుపెడతాడు. దాంతో వారి జీవితాలు చిన్నాభిన్నం అవుతాయి. నెగిటివ్ రోల్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన అర్జున్ దాస్ మరోసారి బుట్టబొమ్మ మూవీతో తన విలనీ పవర్ చూపించాడని తెలుస్తుంది. అసలు ప్రేమ జంట జోలికి అతడు ఎందుకు వెళ్ళాడు? అతనికి కావాల్సింది ఏమీటీ? అనిఖా, సూర్య వశిష్ట లను అతడు ఎందుకు వెంటాడుతున్నాడనేది? ఆసక్తికర విషయం.

యూత్ ని మెప్పించే ఆసక్తికర అంశాలు బుట్టబొమ్మ చిత్రంలో ఉన్నాయి. క్రైమ్ థ్రిల్లర్ ట్రెండ్ నడుస్తుండగా మంచి ఎమోషనల్ లవ్ స్టోరీతో మేకర్స్ వస్తున్నారు. కాన్సెప్ట్ కనెక్ట్ అయితే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మరో భారీ హిట్ పడుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ బీజీఎం మెప్పించింది. ఉన్నత నిర్మాణ విలువలతో తెరకెక్కిన బుట్టబొమ్మ ట్రైలర్ మూవీపై అంచనాలు పెంచేసింది.

ఫిబ్రవరి 4న వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు. శౌరీ చంద్రశేఖర్ టి రమేష్ దర్శకుడిగా ఉన్నాడు. మూవీ విజయంపై మేకర్స్ పూర్తి విశ్వాసంతో ఉన్నారు. చిన్న సినిమా విడుదలై పెద్ద విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. బుట్టబొమ్మ చిత్రానికి పోటీగా మైఖేల్ విడుదలవుతుంది. సందీప్ కిషన్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో మైఖేల్ విడుదల చేస్తున్నారు. ఇవి రెండూ భిన్న జోనర్స్ కావడంతో పోటీ ఉండదని చెప్పొచ్చు


Butta Bomma Trailer Review: While making big films with side star heroes, producer Nagavamshi is making small films with content. He encourages young talent. Recently, DJ Tillu and Swathi Mutyam released under the Sitara Entertainments banner have achieved success. DJ Tillu, however, brought huge profits. Recently, a feel-good emotional love entertainer with the title Buttabomma was released under this banner. Anikha Surendran and Surya Vashishta are playing a couple. Arjun Das of Khaidi and Master fame played another lead role. Serial actress Navya Swamy played another role.

మరిన్ని చదవండి:  ఇలియానా డి'క్రూజ్ ఆసుపత్రిలో చేరారు, నటికి IV ద్రవాలు అందించబడ్డాయి

The trailer was released in the background of the release of the Buttabomma movie. Pure love blossoms between two innocent minds. An unexpected villain enters their happy love story. Their lives will be torn apart. It is known that Arjun Das, who is a care-of-address for negative roles, has once again shown his villainous power in the Buttabomma movie. Why did he go to the real love couple? What does he need? Why is he chasing Anikha and Surya Vashishta? Interesting thing.

Buttabomma movie has interesting elements that appeal to the youth. While the crime thriller trend is going on, the makers are coming up with a good emotional love story. If the concept connects, it will be another huge hit under the Sitara Entertainments banner. Music director Gopi Sundar has been impressed with the BGM. Buttabomma’s trailer, which was shot with high production values, raised the expectations of the movie.

It is releasing worldwide on February 4. Shauri Chandrasekhar is directed by T Ramesh. The makers are confident about the success of the movie. It is expected that the small film will be released and become a big success. Michael will be released in competition with Buttabomma. Michael is releasing Pan India with Sandeep Kishan as the hero. Since these two are different genres, it can be said that there is no competition.


మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

Leave a Comment