కీల‌క స‌మ‌యంలో చంద్రబాబు సైలెంట్‌

sadwik February 3, 2023
మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

Chandrababu Naidu is not going to the people at the crucial time. His limitation to reviews with leaders online is a matter of discussion. If he goes to the people, he is confined to his house with the intention of giving priority to Lokesh. On the other hand, the party ranks say that the Lokesh Padayatra did not get the level of popularity expected by the TDP.

In this background, the TDP leaders are seriously thinking about the future course of action. Chandrababu had an online meeting with TDP constituency in-charges on Thursday. This is the fate of our state, he reviewed the membership registration and other issues. 

Idbe Kharma has started the program for our state, but it is not being carried out forcefully. Apart from the TDP leaders saying that this is the fate of the state, no one is doing it constructively and with commitment.

When Chandrababe doesn’t care, the question arises as to why the leaders at the lower level take the risk. But Chandrababu is worried that if he goes in public, all the media will be around him and Lokesh’s youth will be dumbfounded. The TDP leaders say that due to this reason they are not able to go to the people. The TDP leaders are complaining that they do not understand how many years they will hold the house like this when the elections are approaching.


Chandrababu is silent at the crucial time

కీల‌క స‌మ‌యంలో చంద్ర‌బాబునాయుడు ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్ల‌డం లేదు. ఆన్‌లైన్‌లో నాయ‌కుల‌తో స‌మీక్ష‌ల‌కే ఆయ‌న ప‌రిమితం కావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. తాను జ‌నం వ‌ద్ద‌కు వెళితే, లోకేశ్‌కు ప్రాధాన్యం ద‌క్క‌ద‌నే ఉద్దేశంతో ఆయ‌న ఇంటికి ప‌రిమితం అయ్యారనే ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రోవైపు లోకేశ్ పాద‌యాత్ర‌కు టీడీపీ ఊహించిన స్థాయిలో ప్ర‌జాద‌ర‌ణ ల‌భించ‌లేద‌ని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.

మరిన్ని చదవండి:  కోటంరెడ్డి.. అసలు తగ్గేదే లే!

ఈ నేప‌థ్యంలో టీడీపీ నేత‌లు భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై సీరియ‌స్‌గా ఆలోచిస్తున్నారు. టీడీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌ల‌తో ఆన్‌లైన్‌లో గురువారం చంద్ర‌బాబు స‌మావేశం అయ్యారు. ఇదేం ఖ‌ర్మ మ‌న రాష్ట్రానికి, స‌భ్య‌త్వ న‌మోదు త‌దిత‌ర అంశాల‌పై ఆయ‌న స‌మీక్షించారు.

ఇదేం ఖ‌ర్మ మ‌న రాష్ట్రానికి కార్య‌క్ర‌మాన్ని అట్ట‌హాసంగా ప్రారంభించారే తప్ప‌, దాన్ని బ‌లంగా నిర్వ‌హించ‌డం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అక్క‌డ‌క్క‌డ ఇదేం ఖ‌ర్మ అంటూ టీడీపీ నేత‌లు మొక్కుబ‌డి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డం త‌ప్పితే, నిర్మాణాత్మ‌కంగా, నిబ‌ద్ధ‌త‌తో ఎవ‌రూ చేయ‌డం లేదు.

చంద్ర‌బాబే ప‌ట్టించుకోన‌ప్పుడు, కిందిస్థాయిలో నాయ‌కులు ఎందుకు రిస్క్ చేస్తార‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. అయితే తాను జ‌నంలోకి వెళితే, మీడియా అంతా త‌న చుట్టూ వుంటుంద‌ని, లోకేశ్ యువ‌గ‌ళం మూగ‌బోతుంద‌ని చంద్ర‌బాబు ఆందోళ‌న చెందుతున్నారు. ఈ కార‌ణం వ‌ల్లే జ‌నంలోకి వెళ్ల‌లేక‌పోతున్నార‌ని టీడీపీ నేత‌లు చెబుతున్నారు. ఎన్నిక‌లు స‌మీపించే త‌రుణంలో ఇలా ఎన్నాళ్ల‌ని ఇంటి ప‌ట్టునే వుంటారో అర్థం కావ‌డం లేద‌ని టీడీపీ నేత‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.


మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

Leave a Comment