గ్లోబల్ టాప్-5.. అవతార్ 2 స్థానం ఎక్కడ?

sadwik January 30, 2023
మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

James Cameron’s masterpiece Avatar-The Way of Water. This movie is super hit all over the world. And what is the current position of this movie in terms of collections in global blockbusters?

Avatar-2 is currently the fourth highest-grossing film in the history of world cinema. It is known that Avatar (2.92 billion dollars) stood as the top-1 grosser. Avengers-Endgame (2.79 billion dollars) and Titanic (2.2 billion dollars) took the second place.

Currently, Avatar-2 movie continues at the fourth position in this list with 2.074 billion dollars. According to trade estimates, Avatar-2 is likely to cross Titanic by the end of this weekend. Apart from this competition, another thing to note in this list is that 3 out of these 4 movies are directed by James Cameron.

The film has already surpassed Avengers-Endgame in India. It became the biggest successful Hollywood movie in India. This movie also became number one in Singapore, Korea, Australia and Japan.

It is known that the director Cameron himself had previously announced that the film would have to reach the third or fourth position in all-time hits in order to achieve break-even and turn a profit. So.. Avatar-2 movie seems to have broken even with the latest collections.


Global Top-5.. Where is Avatar 2?

జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి అవతార్-ది వే ఆఫ్ వాటర్. ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్టయింది ఈ సినిమా. మరి గ్లోబల్ బ్లాక్ బస్టర్స్ లో వసూళ్ల పరంగా ప్రస్తుతం ఈ సినిమా స్థానం ఏంటి?

ప్రపంచ సినీచరిత్రలో వసూళ్ల పరంగా అవతార్-2 సినిమా ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతోంది. టాప్-1 గ్రాసర్ గా అవతార్ (2.92 బిలియన్ డాలర్లు) నిలిచిన సంగతి తెలిసిందే. ఇక రెండో స్థానంలో ఎవెంజర్స్- ఎండ్ గేమ్ (2.79 బిలియన్ డాలర్లు), మూడో స్థానంలో టైటానిక్ (2.2 బిలియన్ డాలర్లు) సినిమాలు నిలిచాయి.

మరిన్ని చదవండి:  ‘ఈశ్వర పవనేశ్వర’ అంటూ పవన్ కళ్యాణ్ ని ఆకాశానికి ఎత్తేసిన బాలకృష్ణ..ప్రోమో అదిరిపోయింది

ప్రస్తుతం ఈ లిస్ట్ లో 2.074 బిలియన్ డాలర్లతో అవతార్-2 సినిమా నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ట్రేడ్ అంచనా ప్రకారం, ఈ వీకెండ్ గడిచేసరికి అవతార్-2 సినిమా టైటానిక్ ను క్రాస్ చేసే అవకాశం ఉంది. ఈ పోటీ సంగతి పక్కనపెడితే, ఈ లిస్ట్ లో గమనించాల్సిన మరో అంశం ఏంటంటే.. ఈ 4 సినిమాల్లో 3 సినిమాలు జేమ్స్ కామెరూన్ డైరక్ట్ చేసినవే కావడం విశేషం.

భారత్ లో ఈ సినిమా ఇప్పటికే ఎవెంజర్స్-ఎండ్ గేమ్ ను అధిగమించింది. ఇండియాలో అతిపెద్ద విజయం సాధించిన హాలీవుడ్ మూవీగా అవతరించింది. అటు సింగపూర్, కొరియా, ఆస్ట్రేలియా, జపాన్ లో కూడా ఈ సినిమా నంబర్ వన్ గా నిలిచింది.

ఈ సినిమా బ్రేక్-ఈవెన్ సాధించి, లాభాల్లోకి ఎంటరవ్వాలంటే ఆల్ టైమ్ హిట్స్ లో మూడు లేదా నాలుగో స్థానానికి ఎగబాకాల్సి ఉంటుందని స్వయంగా దర్శకుడు కామరూన్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. సో.. తాజా వసూళ్లతో అవతార్-2 సినిమా బ్రేక్ ఈవెన్ సాధించినట్టయింది.


మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

Leave a Comment