Khushi.. Vijay Devarakonda and Samantha are acting as heroines in the movie. Rumors have been doing rounds about this movie for a few days now. Some people say that this movie has been stopped, while others have started saying that it will not come this year.
It is a fact that the shooting of this film is getting delayed. Due to Samantha’s health condition, the new schedule of this movie did not start at the planned time. In this gap, some other stories have emerged that director Siva Nirvana is going to shift to another project.
Khushi director Siva Nirvana indirectly responded to all this. He tweeted that Khushi’s shooting will start soon and everything will be wonderful.
But except that Shiva responded like this just to deny the rumours, there is no clarity in his statement. It would have been better if he had at least told us from which month the sets will come up. With Shiva Nirvana’s latest announcement, more speculations have started on this film.
There are comments on social media that the director does not know when the regular shoot of Khushi’s film will start. Others are of the opinion that instead of making such statements, it would have been better to remain silent.
He wanted to give clarity.. He confused more
ఖుషి.. విజయ్ దేవరకొండ, సమంత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా. కొన్ని రోజులుగా ఈ సినిమాపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ సినిమా ఆగిపోయిందని కొందరు అంటుంటే, మరికొంతమంది మంది ఈ ఏడాది రాదంటూ చెప్పడం మొదలుపెట్టారు.
ఈ సినిమా షూటింగ్ లేట్ అవుతున్న మాట వాస్తవం. సమంత ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో అనుకున్న టైమ్ కు ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలుకాలేదు. ఈ గ్యాప్ లో దర్శకుడు శివ నిర్వాణ, మరో ప్రాజెక్టుకు షిఫ్ట్ అవ్వబోతున్నాడంటూ మరికొన్ని కథనాలు కూడా పుట్టుకొచ్చాయి.
వీటన్నింటిపై పరోక్షంగా స్పందించాడు ఖుషి దర్శకుడు శివ నిర్వాణ. త్వరలోనే ఖుషి షూటింగ్ స్టార్ట్ అవుతుందని, అంతా అద్భుతంగా ఉంటుందని ట్వీట్ చేశాడు.
అయితే కేవలం పుకార్లను ఖండించడం కోసం శివ ఇలా స్పందించాడు తప్ప, అతడి స్టేట్ మెంట్ లో క్లారిటీ లేదు. కనీసం ఏ నెల నుంచి సెట్స్ పైకి వస్తుందో అతడు చెబితే బాగుండేది. శివ నిర్వాణ తాజా ప్రకటనతో ఈ సినిమాపై మరిన్ని ఊహాగానాలు మొదలయ్యాయి.
ఖుషి సినిమా రెగ్యులర్ షూట్ ఎప్పుడు మొదలవుతుందో దర్శకుడికే తెలియదంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పడుతున్నాయి. ఇలాంటి స్టేట్ మెంట్స్ ఇచ్చే బదులు ఎప్పట్లానే సైలెంట్ గా ఉంటే బాగుండేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.