సినిమా వాళ్లను పెళ్లి చేసుకోనన్న కాజల్ అగర్వాల్

సినిమా వాళ్లను పెళ్లి చేసుకోనన్న కాజల్ అగర్వాల్

సీనియర్ హీరోలు, కుర్ర హీరోలనే తేడా లేకుండా దాదాపు అగ్ర హీరోలందరి సరసన ఆడిపాడింది కాజల్ అగర్వాల్. సౌత్ సినీ ఇండస్ట్రీలో తన అందం, అభినయంతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది ఈ బ్యూటీ. చాలా ఏళ్లుగా ఆమె ఇండస్ట్రీని ఏలుతుండటంతో.. ప్రస్తుతం ప్రేక్షకలోకం దృష్టాంతా ఆమె పెళ్లిపై పడింది. దీంతో ఈ మధ్యకాలంలో ఆమె ఏ ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్లినా పెళ్లికి సంబంధించిన ప్రశ్నలే అడుగుతున్నారట. అయితే తాజాగా ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన కాజల్ తన పెళ్లి విషయమై స్పందించింది.

kajal agarawal amarriage news

kajal agarawal amarriage news

తాను పెళ్లి చేసుకోవాల్సి వస్తే సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులను చేసుకోనని తెలిపింది కాజల్. తనకు సినీ ఇండీస్ట్రీలో ఎందరో స్నేహితులున్నారని, కానీ వారిని జీవిత భాగస్వామిగా ఉహించుకోలేదని, అనుకోకుండా ఇండస్ట్రీ వ్యక్తిని చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినా.. పనిని గౌరవించి అర్థం చేసుకోగలిగే వ్యక్తితం అతనిదైతే అప్పుడాలోచిస్తా అని చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం తాను సినిమాలపైనే దృష్టి పెడుతున్నా తప్ప.. పెళ్లి గురించి పెద్దగా పట్టించుకోవటం లేదని చెప్పింది. ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న తాజా సినిమా ‘భారతీయుడు 2’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.

మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి . . . ! (కింద నంబర్స్ పేజెస్ ఉన్నాయా ఐతే ఇంకా చదవండి క్లిక్ చేయండి )
 •  
 • 13
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  13
  Shares