సినిమా వాళ్లను పెళ్లి చేసుకోనన్న కాజల్ అగర్వాల్

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీ కి వచ్చి పదేళ్ళకి పైనే అవుతుంది. ఇప్పటికీ కుర్ర హీరోలతో నటిస్తోంది. నిర్మాతలు కూడా కాజల్ అగర్వాల్ అడిగినంత రెమ్యూనరేషన్ ముట్టచెబుతున్నారు. దీనికి కారణం కాజల్ కు ఉన్న క్రేజ్.

గతంలో పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని అడిగితే… ఇప్పుడే పెళ్లి ఏంటి అంటూ సమాధానం దాటవేసేది కాజల్ అగర్వాల్.

కానీ ఇటీవలి కాలంలో కాజల్ అగర్వాల్ మనసు పెళ్లి పై పడినట్టుంది. ఎందుకంటే ఈ మధ్య కాజల్ బయట ఎక్కడ చూసినా కూడా పెళ్లి గురించే మాట్లాడుతుంది.

ఇక రీసెంట్ గా కాజల్ తన పెళ్లి పై స్పందిస్తూ “ఇండస్ట్రీ కి చెందిన వ్యక్తిని అయితే అస్సలు పెళ్లి చేసుకోను” అనే స్టేట్ మెంట్ ఇచ్చేసింది. ఇండస్ట్రీ లో తనకి అందరూ ఫ్రెండ్స్ లాంటి వాళ్ళే అని.. వాళ్ళలో ఎప్పుడూ లైఫ్ పార్టనర్ ని చూసుకోలేదు అని.. అందుకే ఇండస్ట్రీ వ్యక్తిని మాత్రం పెళ్లి చేసుకొను అని చెప్పేసింది కాజల్.

మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి . . . ! (కింద నంబర్స్ పేజెస్ ఉన్నాయా ఐతే ఇంకా చదవండి క్లిక్ చేయండి )
 •  
 • 13
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  13
  Shares