కియరా అద్వానీ పెళ్లి.. హోటల్ మొత్తం బుక్

sadwik February 3, 2023
మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

Kiara Advani and Siddharth Malhotra are going to get married in a few days. Their wedding will take place in Jaisalmer, Rajasthan. They have booked a luxurious hotel resort in the city for the wedding. They booked not just a few rooms, but the entire hotel. That too for 3 days.

Kiara is getting married on 6th. Pre-wedding celebrations are going to start from 4th. This couple booked all the rooms in the hotel for 3 days. This five star hotel luxury resort has rooms in different categories. Rooms are available in various categories such as Pavilion Room, Heritage Room, Signature Suite, Luxury Suite..

The prices of these are between 24 thousand rupees to 76 thousand rupees per night. If you want to stay in the most expensive Dhar Haveli suite, you have to pay 1 lakh 30 thousand rupees per night. All these rooms were booked by Kiara-Siddharth for 3 days.

The couple invited 100 to 125 guests for this wedding. Most of them are friends and relatives. There are very few celebrities like Karan Johar from Bollywood. 70 luxury cars have also been arranged to receive all of them from the airport. These cars will be available to the guests for 3 days.

The entire resort has already been decorated for the wedding. Both the bride and groom will reach the hotel tomorrow evening. Kiara’s wedding ceremony will start with Haldi function. Kiara will join the shooting of Ram Charan-Shankar’s film as soon as this wedding is over. 


Kiara Advani’s wedding.. The entire hotel is booked

మరికొన్ని రోజుల్లో కియరా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా పెళ్లి చేసుకోబోతున్నారు. రాజస్థాన్ లోని జైసల్మేర్ లో వీళ్ల పెళ్లి జరుగుతుంది. పెళ్లికి సంబంధించి నగరంలోని ఓ విలాసవంతమైన హోటల్ రిసార్ట్ ను వీళ్లు బుక్ చేశారు. కేవలం కొన్ని గదులు మాత్రం కాదు, ఏకంగా హోటల్ మొత్తాన్ని వీళ్లు బుక్ చేశారు. అది కూడా 3 రోజుల పాటు.

మరిన్ని చదవండి:  ఫోటోలు: సెల్యులాయిడ్ సీత నీలి వేషధారణలో

6వ తేదీన కియరా పెళ్లి చేసుకోబోతోంది. 4వ తేదీ నుంచి ప్రీ-వెడ్డింగ్ సంబరాలు మొదలుకాబోతున్నాయి. దీనికోసం హోటల్ లోని గదులన్నింటినీ 3 రోజుల పాటు బుక్ చేసేసింది ఈ జంట. ఈ ఫైవ్ స్టార్ హోటల్ లగ్జరీ రిసార్ట్ లో వివిధ కేటగిరీల్లో గదులున్నాయి. పెవిలియన్ రూమ్, హెరిటేజ్ రూమ్, సిగ్నేచర్ సూట్, లగ్జరీ సూట్.. ఇలా వివిధ విభాగాల్లో రూమ్స్ అందుబాటులో ఉన్నాయి.

వీటి ధరలు ఒక్క రాత్రికి 24వేల రూపాయల నుంచి 76వేల రూపాయల మధ్యలో ఉన్నాయి. ఇక అత్యంత ఖరీదైన ధార్ హవేలీ సూట్ లో ఉండాలంటే ఒక రాత్రికి లక్షా 30వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ రూమ్స్ అన్నింటినీ కియరా-సిద్దార్థ్ 3 రోజుల పాటు బుక్ చేసేశారు.

ఈ పెళ్లికి 100 నుంచి 125 మంది అతిథుల్ని ఆహ్వానించింది ఈ జంట. వీళ్లలో స్నేహితులు, బంధువులే ఎక్కువగా ఉన్నారు. బాలీవుడ్ నుంచి కరణ్ జోహార్ లాంటి అతికొద్దిమంది  ప్రముఖులు మాత్రమే ఉన్నారు. వీళ్లందర్నీ ఎయిర్ పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకునేందుకు 70 లగ్జరీ కార్లను కూడా ఏర్పాటు చేశారు. 3 రోజుల పాటు ఈ కార్లు సదరు అతిథులకు అందుబాటులో ఉంటాయి.

పెళ్లి కోసం ఇప్పటికే రిసార్ట్ మొత్తం సర్వాంగసుందరంగా ముస్తాబైంది. కాబోయే వధూవరులిద్దరూ రేపు సాయంత్రానికే హోటల్ కు చేరుకుంటారు. హల్దీ ఫంక్షన్ తో కియరా పెళ్లి వేడుక మొదలుకానుంది. ఈ పెళ్లి తంతు ముగిసిన వెంటనే తిరిగి రామ్ చరణ్-శంకర్ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతుంది కియరా.


మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

Leave a Comment