దసరా కు మళ్లీ మెగా..నందమూరి ఢీ

sadwik February 1, 2023
మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

There are only three remaining seasons for Tollywood. Sankranti Summer. Dussehra. They want to release big movies in these seasons. The fear of what will happen if it comes in non-season is haunting. No matter how many big graves are said, this is what will be done in the end. 

This time many films are being released for Dussehra. Dussehra is coming in October this year. Films are being planned here and there from about two weeks before that. But who will come? Who will stop? That will be known later. But whose preparations are theirs first. It seems that big movies will come for Sankranti in 2024. It is difficult to compete with them. It could be a Shankar-Ram Charan movie. It could be a Bunny-Sukumar movie. Prabhas-project may be K movie. That’s why everyone’s focus is on Dussehra this year.

Prabhas has already given a date for Salar’s movie. That is the end of September. Bholashankar, which is produced by Anil Sunkara with Megastar, has decided to get ready for Dussehra. They are planning to this extent.

Producer AM Ratnam and director Krish are determined to make Pawan Kalyan’s Hari Hara Veeramallu movie ready for Dussehra. But it depends on Pawan’s grace.

The Balayya-Anil Ravipudi-Sahu Garapati movie is also being completed by the end of July and there are plans to release it a little before Dussehra.

This is the only date for the Mahesh-Trivikram movie. Sankranti would be good, but I don’t know how much chance there will be.

Many films are in the planning. Therefore, this time the release schedule for Dussehra time seems to be tight.


Mega again for Dussehra.. Nandamuri Dhi

టాలీవుడ్ కు మిగిలిన సీజన్లు మూడే మూడు. సంక్రాంతి. సమ్మర్. దసరా. ఈ సీజన్లలోనే పెద్ద సినిమాలు విడుదల చేయాలనుకుంటారు. నాన్ సీజన్ లో వస్తే ఏమవుతుందో అన్న భయం వెంటాడుతూ వుంటుంది. ఎన్ని పెద్ద కబర్లు చెప్పినా, చివరకు చేసేది ఇదే.

మరిన్ని చదవండి:  కిరణ్ అబ్బవరం ‘బ్రేకప్ పార్టీ’

ఈసారి దసరాకు కాస్త అటు ఇటుగా చాలా సినిమాలు మోహరిస్తున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ లో వస్తోంది దసరా. దానికి కాస్త రెండు వారాలు ముందు నుంచి అటు ఇటుగా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఎవరు వస్తారు? ఎవరు ఆగుతారు? అన్నది తరువాత తెలుస్తుంది. ముందు అయితే ఎవరి సన్నాహాలు వారివి. అందులోనూ 2024 సంక్రాంతికి భారీ సినిమాలు వస్తాయని తెలుస్తోంది. వాటితో పోటీపడడం కష్టం. అది శంకర్-రామ్ చరణ్ సినిమా కావచ్చు. బన్నీ-సుకుమార్ సినిమా కావచ్చు. ప్రభాస్-ప్రాజెక్ట్ కే సినిమా కావచ్చు. అందుకే అందరి దృష్టి ఈ ఏడాది దసరా మీద పడింది.

ప్రభాస్ సలార్ సినిమాకు ఇప్పటికే డేట్ ఇచ్చేసారు. సెప్టెంబర్ నెలాఖరు అని. మెగాస్టార్ తో అనిల్ సుంకర నిర్మించే భోళాశంకర్ సినిమాను దసరాకు రెడీ చేయాలని డిసైడ్ అయిపోయారు. ఈ మేరకు ప్లాన్ చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమాను ఎలాగైనా దసరాకు రెడీ చేయాలని నిర్మాత ఎఎమ్ రత్నం..దర్శకుడు క్రిష్ ల సంకల్పం. కానీ అది పవన్ దయ మీద ఆధారపడి వుంటుంది.

బాలయ్య-అనిల్ రావిపూడి-సాహు గారపాటి సినిమా కూడా జూలై నెలాఖరుకు పూర్తి చేసి, దసరాకు కాస్త ముందుగా విడుదల చేయాలని ఆలోచనలు సాగుతోంది.

మహేష్-త్రివిక్రమ్ సినిమాకు కూడా వున్న డేట్ ఇది ఒక్కటే. సంక్రాంతి అయితే బాగుంటుంది కానీ, అక్కడ ఎంత వరకు అవకాశం వుంటుందో తెలియదు.

ఇలా చాలా సినిమాలు ప్లానింగ్ లో వున్నాయి. అందువల్ల ఈసారి దసరా టైమ్ కు విడుదల గడబిడ కాస్త గట్టిగానే వుండేలా వుంది.


మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

Leave a Comment