కె.విశ్వనాథ్ మృతికి మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్బ్రాంతి

sadwik February 3, 2023
మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

Megastar Chiranjeevi expressed deep grief over the death of Kalathapaswi K. Vishwanath. “I was moved by the passing of Vishwanath, a great director who took my Telugu films to an international level.

I was shocked to hear the news of his passing away today. The death of a director like him is a huge loss not only for me but also for the Telugu film industry. At this time, I want to give his family members the strength to bear this pain,” he said.

Chiranjeevi had a special bond with K. Vishwanath. Chiru considers him as a member of his own family. From time to time K. Vishwanath keeps meeting the couple. Along with his wife Surekha, he used to go to K. Vishwanath’s house and take his blessings. Guru K Vishwanath who taught many tricks related to acting.

Chiranjeevi and K. Vishwanath are a successful combination in the Telugu film industry. The two films together like ‘Shabhalekha’, ‘Swayamkrishi’ and ‘Apadbandhavudu’ have received massive success. All these movies are also super hits musically.

K.Vishwanath made these movies by combining love, emotions and family relations with wonderful music. All these also became blockbusters. They have remained evergreen films forever.


Megastar Chiranjeevi is deeply saddened by the death of K. Vishwanath

కళాతపస్వి కె.విశ్వనాథ్ మృతికి మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ‘’నా తెలుగు చిత్రాల స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లిన గొప్ప దర్శకులు విశ్వనాథ్ గారు కాలం చేయడం నన్ను కలచి వేసింది.

ఈరోజు ఆయన కన్నుమూసిన వార్త విన్న నేను షాక్ కు గురయ్యాను. ఆయన లాంటి డైరెక్టర్ కన్నుమూయటం నాకే కాదు తెలుగు సినీ పరిశ్రమకే తీరని లోటు. ఈ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు ఈ బాధను తట్టుకునే శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.

మరిన్ని చదవండి:  రచయిత పద్మభూషణ్‌కు సానుకూల స్పందన వచ్చింది

కె.విశ్వనాథ్ గారితో చిరంజీవికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆయన్ను సొంత కుటుంబ సభ్యుడిలా భావిస్తారు చిరు. ఎప్పటికప్పుడు కె.విశ్వనాథ్ దంపతులను కలుస్తూనే ఉంటారు. తన భార్య సురేఖతో కలిసి కె.విశ్వనాథ్ ఇంటికి వెళ్లి ఆయన ఆశ్వీర్వాదం తీసుకుంటూ ఉంటారు.  నటనకు సంబంధించి ఎన్నో మెలుకవులు నేర్పించిన గురువు కె విశ్వనాథ్ గారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి, కె.విశ్వనాథ్‌లది సక్సెస్‌ ఫుల్‌ కాంబినేషన్‌ అనే చెప్పాలి. వీరిద్దరూ కలిసి చేసిన ‘శభలేఖ’, ‘స్వయంకృషి’, ‘ఆపద్బాంధవుడు’ వంటి సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఈ సినిమాలన్నీ మ్యూజికల్ గా కూడా సూపర్ హిట్స్.

అద్భుతమైన సంగీతానికి,  ప్రేమ, ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్ ని కలగలిపి కె.విశ్వనాథ్‌ ఈ సినిమాలను రూపొందించారు. ఇవన్నీ కూడా బ్లాక్‌బస్టర్స్ గా నిలిచాయి. ఎప్పటికీ ఎవర్‌ గ్రీన్‌ సినిమాలుగా నిలిచిపోయాయి.

 


మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

Leave a Comment