తాకట్టులో మోహన్ బాబు ఆస్తులు .బాధలో కుటుంబసభ్యలు

తాకట్టులో మోహన్ బాబు ఆస్తులు .బాధలో కుటుంబసభ్యలు

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కి ఎంతో ప్రత్యేకత ఉంది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల కాలం నుంచి ఆయన ఇప్పటి హీరోల వరకు నటిస్తూ వస్తున్నారు. సాంఘిక, జానపద, పౌరాణిక పాత్రల్లో నటించిన మోహన్ బాబు నటుడిగానే కాకుండా నిర్మాత, దర్శకుడిగా కూడా తన సత్తా చాటుతున్నారు. రాజకీయ, విద్యావేత్తగా కొనసాగుతున్నారు.

mohan babu on Tirupathi College

mohan babu on Tirupathi College

తాజాగా చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శ్రీవిద్యానికేతన్‌ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ..ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు చెప్పారు. గత రెండు సంవత్సరాల నుంచి ప్రభుత్వం నుంచి రూ. 20 కోట్ల మేర డబ్బు రావాల్సి ఉందని. కానీ దాన్ని ప్రభుత్వం మంజూరు చేయడం లేదన్నారు. దీని వల్ల విద్యాసంస్థలను నడపడం కూడా కష్టమైపోతోందన్నారు.

ఇందు కోసం తన ఆస్తులను తాకట్టు పెట్టారు. బ్యాంకుల్లో రుణాలు కూడా తీసుకున్నారు. కాలేజీల నిర్వాహణకు ఒక్క నెలకు ఆరు కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. ఓ వైపు సినిరంగంలో కొనసాగుతూనే విద్యావేత్తగా విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసం పాటు పడుతున్నారు మోహన్ బాబు. కాగా, ప్రభుత్వం నుంచి సొమ్ము రాకపోయినా సకాలంలో సిబ్బందికి జీతాలిస్తున్నట్టు చెప్పారు.

 

 

మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి . . . ! (కింద నంబర్స్ పేజెస్ ఉన్నాయా ఐతే ఇంకా చదవండి క్లిక్ చేయండి )
 •  
 • 13
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  13
  Shares