జెర్సీ చాలా స్పీడ్‌గా చేస్తున్నాడు.. ఎందుకంటే.?

జెర్సీ చాలా స్పీడ్‌గా చేస్తున్నాడు.. ఎందుకంటే.?

 

యంగ్‌ హీరో నాని ప్రస్తుతం గౌతమ్‌ దర్శకత్వంలో ‘జెర్సీ’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం కథ క్రికెట్‌ నేపథ్యంలో ఉంటుందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. క్రికెటర్‌గా నాని ఈ చిత్రంలో కనిపిస్తాడని సమాచారం అందుతోంది. నాని గత చిత్రం ‘దేవదాసు’ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. అందుకే వెంటనే మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ఉవ్విల్లూరుతున్నాడు. వేసవిలో ‘జెర్సీ’ విడుదల చేయాలని భావించారు. కాని వీలుంటే ముందే విడుదల చేసేందుకు కూడా నాని సిద్దంగా ఉండాలనే ఉద్దేశ్యంతో సినిమాను సింగిల్‌ షెడ్యూల్‌తోనే పూర్తి చేయాలని దర్శకుడు గౌతమ్‌ను రిక్వెస్ట్‌ చేసినట్లుగా తెలుస్తోంది. మరో వైపు కొత్త సినిమాలకు కూడా నాని కమిట్‌ అవుతున్నట్లుగా తెలుస్తోంది.

 

Nani Jersey Movie

Nani Jersey Movie

 

Nani’s New Movie Jersey on Shoot – ‘జెర్సీ’ చాలా స్పీడ్‌గా చేస్తున్నాడు.. ఎందుకంటే.?

 

‘జెర్సీ’ చిత్రం తర్వాత నాని నటించబోతున్న సినిమాకు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించబోతున్నాడు. ఇప్పటికే ఆయన దర్శకత్వంలో రెండు సినిమాలు చేసిన నాని మరోసారి ఆయన దర్శకత్వంలో సినిమాను చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడు. త్వరలోనే సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నారు. జనవరి నుండి ఇంద్రగంటి దర్శకత్వంలో మూవీని రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించబోతున్నాడు. నాని చాలా స్పీడ్‌గా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఈ స్పీడ్‌తో క్వాలిటీ ఏమైనా మిస్‌ అవుతుందేమో అనే ఆందోళనలో ఆయన అబిమానులు ఉన్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చిత్రీకరణ కోసం నాని క్రికెట్‌ గ్రౌండ్‌ లో కుస్తీ పడుతున్నాడు. జెర్సీలో నానికి జోడీగా శ్రద్దా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే.

 

మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి . . . ! (కింద నంబర్స్ పేజెస్ ఉన్నాయా ఐతే ఇంకా చదవండి క్లిక్ చేయండి )
 •  
 • 5
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  5
  Shares