Former partner of Maithri Sanstha, NRI CV Mohan is starting his first film as a producer. Nani is starting a movie with a new director named Shaurya as the hero. This film pooja will be held on 31st of this month. Mrinalini Thakur will play the heroine in this movie.
This is Nani’s thirtieth film. Bollywood music composer Abdul Wahab, who is working on Khushi in Telugu, is working on this film.
On 31st Puja will be formally celebrated and they will go from one to continuous schedule. The movie is made with a different plot. This is the movie that made me OK after Dussehra movie. Like the Dussehra film, a new cinematographer is working for this too. Nani, who has been doing one film after another, has recently completed the Dussehra film.
Nani is struggling with the lack of hits before and after the movie Jersey. Shyam Singarai is the only one. He is touching everything so that whatever he does, he will get a hit. This is the latest news.
Nani’s new movie will be launched on 31st
మైత్రీ సంస్థ మాజీ భాగస్వామి, ఎన్నారై సి వి మోహన్ నిర్మాతగా తొలి సినిమాకు శ్రీకారం చుడుతున్నారు. నాని హీరోగా శౌర్య అనే కొత్త దర్శకుడితో సినిమా ప్రారంభిస్తున్నారు. ఈ సినిమ పూజ ఈనెల 31న జరుగుతుంది. మృణాళిని ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.
నాని నటించే ముప్పయ్యవ సినిమా ఇది. తెలుగులో ఖుషి సినిమాకు పని చేస్తున్న బాలీవుడ్ సంగీత దర్ళకుడు అబ్దుల్ వాహబ్ ఈ సినిమాకు పని చేస్తున్నారు.
31న ఫార్మల్ గా పూజ జరుపుకుని, ఒకటి నుంచి కంటిన్యూ షెడ్యూలు కు వెళ్తారు. ఓ వైవిధ్యమైన కథాంశంతో తయారవుతుందీ సినిమా. దసరా సినిమా తరువాత నాని ఓకె చేసిన సినిమా ఇది. దసరా సినిమా మాదిరిగానే దీనికి కూడా కొత్త దర్ళకుడు పని చేస్తున్నారు. ఒక సినిమా తరువాత మరో సినిమా చేస్తూ వస్తున్న నాని, ఇటీవలే దసరా సినిమా పూర్తి చేసారు.
జెర్సీ సినిమా ముందు వెనుక హిట్ లు లేక ఇబ్బంది పడుతున్నాడు నాని. శ్యామ్ సింగరాయ్ ఒకటే ఊరట. ఏది చేస్తే హిట్ చేతిలో పడుతుందో అని ప్రతి ఒక్కటీ టచ్ చేస్తూ వస్తున్నాడు. అందులో ఇది లేటెస్ట్ అన్నమాట.