మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .
Pawan Kalyan reacts on his marriages. Pawan has married 3 times in his life, not one, not two. Balayya directly questioned Pawan on this. But there was no straight answer from Pawan. He said that he wanted to be celibate most of all and had 3 marriages.
“I thought that I should not get married. I wanted to be a bachelor and go on the path of yoga. I wonder if so many marriages have happened to me. I didn’t plan anything. I got married for the first time and it was the relationship I saw at home. Something in the relationship didn’t work out, so we broke up.”
Pawan said that he married again for the second time… even then there were differences of opinion. He said that due to some circumstances, he had to part with Renudesai as he could not reach a consensus on some issues. But he said that he legally divorced everyone and remarried.
“Every time they criticize me saying 3 marriages. I didn’t do three marriages at once. I didn’t live with three people at the same time. I didn’t put all three in the same room. Because I couldn’t get along with one, I got another one. Because I couldn’t get along with them too, I got another one. 3 There is no gilt on marriage.”
This is how Pawan Kalyan defended his 3 marriages. It is said that he did not do arranged marriages out of infatuation, they happened that way in his life.
Pawan did not marry 3 out of infatuation
తన పెళ్లిళ్లపై పవన్ కల్యాణ్ స్పందించారు. తన జీవితంలో ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 3 పెళ్లిళ్లు చేసుకున్నారు పవన్. వీటిపై బాలయ్య సూటిగా పవన్ ను ప్రశ్నించారు. అయితే పవన్ నుంచి మాత్రం అంతే సూటిగా సమాధానం రాలేదు. మరీ ముఖ్యంగా బ్రహ్మచారిగా ఉండాలనుకొని, 3 పెళ్లిళ్లు చేసుకున్నానని చెప్పారు.
“అసలు పెళ్లి చేసుకోకూడదని అనుకున్నాను. బ్రహ్మచారిగా ఉంటూ, యోగమార్గంలో వెళ్లిపోవాలనుకున్నాను. ఇన్ని పెళ్లిళ్లు నాకే జరిగాయా అనే ఆశ్చర్యం కూడా కలుగుతుంది. నేను ఏదీ ప్లాన్ చేయలేదు. మొదటిసారి పెళ్లి చేసుకున్నాను, ఇంట్లో చూసిన సంబంధం అది. రిలేషన్ షిప్ లో కొన్ని కుదరలేదు, అలా విడిపోయాం.”
రెండోసారి మళ్లీ పెళ్లి చేసుకున్నానని… అప్పుడు కూడా అభిప్రాయబేధాలొచ్చాయన్నారు పవన్. కొన్ని పరిస్థితుల వల్ల, కొన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదరక రేణుదేశాయ్ తో విడిపోవాల్సి వచ్చిందన్నారు. అయితే ప్రతి ఒక్కరికీ చట్టబద్దంగానే విడాకులిచ్చి మరో పెళ్లి చేసుకున్నానని తెలిపారు.
“ప్రతిసారి 3 పెళ్లిళ్లు అంటూ విమర్శిస్తున్నారు. నేను ముగ్గుర్ని ఒకేసారి చేసుకోలేదు. ముగ్గురితో ఒకేసారి ఉండలేదు. ముగ్గుర్నీ ఒకే గదిలో పెట్టలేదు. ఒకరితో కుదరలేదు కాబట్టి ఇంకొకర్ని చేసుకున్నారు. వాళ్లతో కూడా కుదర్లేదు కాబట్టి వేరే ఇంకొకర్ని చేసుకున్నాను. ప్రతి ఒక్కరికి చట్టబద్దంగా విడాకులిచ్చి మరో పెళ్లి చేసుకున్నాను. చాలామందికి అది ఆయుధంగా మారిపోయింది. నాకు మాత్రం 3 పెళ్లిళ్లపై ఎలాంటి గిల్ట్ లేదు.”
ఇలా తన 3 పెళ్లిళ్లను సమర్థించుకున్నారు పవన్ కల్యాణ్. వ్యామోహంతో తను వరుసపెట్టి పెళ్లిళ్లు చేసుకోలేదని, తన జీవితంలో అవి అలా జరిగిపోయాయని చెబుతున్నారు.
మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .