The most awaited film from Pawan Kalyan is Hari Hara Veeramallu. It is a format movie with songs and fights. The latest update is that this movie is 60 percent complete. Forty percent is still outstanding. It also has two songs. T/T will not be released except for the amount of the talk. Producer Ratnam is determined to release on Dussehra anyway. Director Krish.
They are confident that the talkie will be completed by the month of May and even if the post-production time is taken a little late, it will be possible to release it by Dussehra. They are thinking that if they go to Sankranti, there will be a competition, but if it is Dussehra, no one else will come to the competition. It seems that no rights related to the movie have been sold yet.
The audio rights were sold to TIPS company a long time ago. It seems that it was sold for just five and a half crores at that time. But now there would have been a good income.
The film would have already been completed. But Pawan is getting delayed due to politics, other works and other films. Besides that, there is talk that the script has been changed so that he cannot do big fights.
Pawan Kalyan new movie ‘Hari Hara Veera mallu’ is 60 percent complete
పవన్ కళ్యాణ్ నుంచి మోస్ట్ అవైటెడ్ సినిమా ఏదైనా వుందీ అంటే అది హరి హర వీరమల్లు మాత్రమే. పాటలు, ఫైట్లు వున్న ఓ ఫార్మాట్ సినిమా అది. ఈ సినిమా 60 శాతం పూర్తయిందన్నది లేటెస్ట్ అప్ డేట్. ఇంకా నలభై శాతం బకాయి వుంది. ఇందులో రెండు పాటలు కూడా వున్నాయట. టాకీ మొత్తం అయితే తప్పించి టీ/ర్ విడుదల చేయరట. ఎలాగైనా దసరాకు విడుదల చేయాలనే సంకల్పంతో వున్నారు నిర్మాత రత్నం. దర్శకుడు క్రిష్.
మే నెల నాటికి టాకీ పూర్తయిపోతుందని, కొంచెం ఆలస్యమైనా పోస్ట్ ప్రొడక్షన్ టైమ్ తీసుకున్నా దసరాకు పక్కా విడుదల పాజిబుల్ అనే ధీమాతో వున్నారు. సంక్రాంతికి వెళ్తే పోటీ వస్తుందని, దసరాకు అయితే మరెవరు పోటీకి రారనే ఆలోచన చేస్తున్నారు. సినిమా కు సంబంధించి ఏ హక్కులు ఇంకా విక్రయించలేదని తెలుస్తోంది.
టిప్స్ సంస్థకు అడియో హక్కులు మాత్రం చాలా అంటే చాలా కాలం క్రితం విక్రయించేసారట. జస్ట్ అప్పట్లో అయిదున్నర కోట్లకే విక్రయించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు అయితే మంచి ఆదాయం వచ్చి వుండేది.
సినిమా ఇప్పటికే పూర్తి అయి వుండేది. కానీ పవన్ రాజకీయాలు, ఇతర పనులు, ఇతర సినిమాలతో ఆలస్యం అవుతూ వస్తోంది.దానికి తోడు భారీ ఫైట్లు చేయలేనని స్క్రిప్ట్ ను మార్పించారనే టాక్ కూడా వుంది.