30న పవన్ కొత్త సినిమా ఓపెనింగ్

Telugu January 27, 2023
మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

Power star Pawan Kalyan is hitting the coconut for another movie. Hariharaviramallu, which is already in half, remains the same. Mythri Movies-Harish Shankar’s movie Pooja. It is so.

There is also a People’s Media movie next to it. Sai Dharam Tej is the hero in this movie. The fans and the movie people don’t know what Pawan Kalyan’s intention is to do everything without completing any film.

The thing is that on the 30th of this month, Pawan Kalyan-DVV ​​Danayya-Sujeeth is doing a pooja for the movie. There is talk that director Trivikram is strong behind the setting of this movie. There is also talk that he is the obstacle for Harish Shankar-Maitri’s film. In such a background, while Maithri’s film Puja is being done, various gossip is being heard about Sujith’s film being worshipped.

The election heat is on in Andhra. Lokesh is doing padayatra. Varahi Vahanam Pujas have been done. And without jumping into the political arena, what do you think of worshiping movie after movie and keeping the producers and directors waiting?

Unfortunately, if Pawan is taking advances of crores while waiting for Pawan to make eyeballs like this, these directors are not able to make other films and lose crores year after year, Pawan himself should think about how fair it is.

——————————————–

Pawan’s New movie OG opening on 30th

ముచ్చటగా మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పటికే సగంలో వున్న హరిహరవీరమల్లు అలాగే వుంది. మైత్రీ మూవీస్-హరీష్ శంకర్ సినిమా పూజ చేసి వుంచారు. అది అలా వుంది.

ఇంకో పక్కన పీపుల్స్ మీడియా సినిమా కూడా వుండనే వుంది. సాయి ధరమ్ తేజ్ హీరో ఈ సినిమాలో. అసలు ఏ సినిమా పూర్తి చేయకుండా ప్రతీదీ కొబ్బరికాయ కొట్టించేయడంలో పవన్ కళ్యాణ్ ఆంతర్యం ఏమిటో తెలియడం లేదు ఫ్యాన్స్ కు, సినిమా జనాలకు కూడా.

మరిన్ని చదవండి:  ఇద్దరు నాయకులు చాలా నమ్మశక్యం కాని విషయాలు మాట్లాడుతున్నారు

ఇంతకీ విషయం ఏమిటంటే ఈ నెల 30న పవన్ కళ్యాణ్-డివివి దానయ్య-సుజీత్ సినిమాకు పూజ చేసేస్తున్నారు. ఈ సినిమా సెట్టింగ్ వెనుక దర్శకుడు త్రివిక్రమ్ బలంగా వున్నారని టాక్ వుంది. హరీష్ శంకర్-మైత్రీ సినిమాకు ఆయనే అడ్డం అనే టాక్ కూడా వుంది. అలాంటి నేపథ్యంలో మైత్రీ సినిమా పూజ జరిగి వుండగా, సుజిత్ సినిమాకు పూజ జరిపించేయడం పై రకరకాల గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.

ఆంధ్రలో ఎన్నికల వేడి వుంది. లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. వారాహి వాహనం పూజలు జరిగిపోయాయి. మరి అటు రాజకీయ రంగంలో దూకకుండా, సినిమాల మీద సినిమాలకు పూజలు జరిపించడం, నిర్మాతలను, దర్శకులను అలా వెయిటింగ్ లో వుంచేయడం అంటే ఏమనుకోవాలో?

పాపం, పవన్  కోసం అలా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తూ, పవన్ కోట్లు అడ్వాన్స్ లు తీసుకుంటూ వుంటే, ఈ దర్శకులు మాత్రం వేరే సినిమాలు చేయలేక, ఏళ్లకు ఏళ్లు ఖాళీగా వుంటూ కోట్లు పోగొట్టుకోవడం, ఎంత వరకు న్యాయమో పవన్ నే ఆలోచించుకోవాలి.


మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

Leave a Comment