ప్రియా ప్రకాష్ తో ముచ్చట్లు

Priya Prakash Warrier Movie Lover’s Day Audio Release Chief Guest Allu Arjun – అలా కన్నుగీటి.. ఇలా కుర్రకారు మనసులు దోచిన కేరళ కుట్టి ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. గత ఏడాది ప్రేమికుల రోజున విడుదలైన ఆమె తొలి సినిమా ‘ఒరు అడార్‌ లవ్‌’లోని పాట టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె కన్నుగీటిన తీరుకు సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు సైతం ఫిదా అయ్యారు. అల్లు అర్జున్‌ ట్విటర్‌ వేదికగా ప్రియను ప్రత్యేకించి అభినందించారు.

 

priya-prakash-allu-arjun

priya-prakash-allu-arjun

 

Priya Prakash About her Biography and Hobbies, Priya Prakash College Life

 

‘ఒరు అడార్‌ లవ్‌’కు ఒమర్‌ లులు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘లవర్స్‌ డే’ టైటిల్‌తో ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేయబోతున్నారు. బుధవారం నిర్వహించబోతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకకు బన్నీ అతిథిగా హాజరు కాబోతున్నారు. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా ప్రియ మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తన సినీ కెరీర్‌ ఆరంభం గురించి ముచ్చటించారు. ఆ విశేషాలివి..

 

* ‘ప్రస్తుతం నేను బీకామ్‌ రెండో సంవత్సరం చదువుతున్నా. నేను నటిని కావాలన్నది మా నాన్న కల. నా తొలి సినిమా ‘ఒరు అడార్‌ లవ్‌’. ఇందులోని పాటతో కన్నుగీటిన భామగా నాపై ముద్రపడింది. సోషల్‌మీడియాలో బాగా పాపులారిటీ వచ్చింది. దాన్ని ఎంజాయ్‌ చేశా. పాటలోని కన్నుగీటే సన్నివేశం వల్ల ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి వచ్చింది. ఎక్కడికైనా వెళితే జనాలు నా చుట్టూ గుమిగూడేవారు. కొన్నాళ్లు ఇబ్బందిపడ్డా..

 

తర్వాత అలవాటు అయ్యింది. దీని వల్ల నేను ప్రైవసీ ఏం కోల్పోలేదు. వేరే భాషా చిత్రాల్లోనూ ఆఫర్లు వచ్చాయి. ‘ఒరు అడార్‌ లవ్‌’ వల్ల దేన్నీ ఓకే చేయలేదు. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కాబోతోంది’.

 

 

* ‘అల్లు అర్జున్‌ సినిమాలో నటించే ఆఫర్‌ వచ్చింది. కానీ మిస్‌ చేసుకున్నా. నా రెండో సినిమా ‘శ్రీదేవి బంగ్లా’ ట్రైలర్‌ ఇటీవల విడుదలైంది. ఈ సినిమా విషయంలో నాకు నిర్మాత బోనీ కపూర్‌ నుంచి నోటీసులు రాలేదు. వివాదం గురించి దర్శక, నిర్మాతలు చూసుకుంటారు’.

 

* ‘కన్నుగీటే సన్నివేశాన్ని సింగిల్‌ టేక్‌లో చేశా. రిహార్సల్స్ కూడా చేయలేదు. నా నటన చూసి కాలేజీ స్నేహితులు కూడా షాక్‌ అయ్యారు. చిన్నప్పటి నుంచి పాటలు పాడటం, నటించడం నాకు అలవాటు’.

 

* ”ఒరు అడార్‌ లవ్‌’ సినిమాపై అంచనాలు బాగా ఉన్నాయి. ఇది పాఠశాల నేపథ్యంలో నడిచే ప్రేమకథ. ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టు ఉంటుంది. ఇందులో ఆరు పాటలు ఉంటాయి. నాకు తొలి సినిమాతోనే ఇంత గుర్తింపు రావడం ఆనందంగా ఉంది’.

మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి . . . ! (కింద నంబర్స్ పేజెస్ ఉన్నాయా ఐతే ఇంకా చదవండి క్లిక్ చేయండి )
 •  
 • 1
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1
  Share