కంటి నిద్ర లేకపోతే ఆ వ్యాధి వచ్చే అవకాశం ఉందట?

Telugu January 27, 2023
మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

Quality Sleep: A man should have a full stomach and sleep. Otherwise, there is a risk of getting infected. These two are essential for a healthy person. Anything short of this is bound to cause trouble. A healthy digestive system helps us digest the food we eat. Also, good sleep boosts the immune system. Every man should sleep six to eight hours a day. Otherwise, our organs will not function properly. Diseases are likely to spread. In this context, sleep should not be neglected. Try to sleep at the right time of the day. We get all health through sleep.

If you don’t sleep properly, it affects your eyes. Eye damage is possible. Then other organs are affected. A study of adolescents revealed several interesting facts. Those who slept for more than six hours a day did not see any diseases. Those who sleep one hour less have many health problems. It has been found that sleep strengthens our immune system.

That’s why there are problems if there is no sleep. In this background, sleep is also important to keep the body strong. It has been found that the brain functions better if you sleep for at least seven to eight hours. Lack of sleep increases the risk of diseases like diabetes and hypertension. People who get less sleep also have forgetfulness problems. Thinking power is reduced. Agility slows down. There is also a risk of heart attack and cancer.

If you don’t get enough sleep in your teens, you may develop multiple sclerosis. This was stated in an article published in the Journal of Neurology, Neurosurgery, and Psychiatry. It has been identified as a disease that damages the brain, spinal cord, nerves, and eye nerves. This affects mostly those who work in shift mode. Teenagers should sleep at least 7-9 hours a day to prevent them from getting affected. About 40 percent of people who sleep less often have these symptoms.


మనిషికి కడుపు నిండా తిండి కంటి నిండ నిద్ర ఉండాలి. లేదంటే రోగాల బారిన పడే ప్రమాదం ఉంటుంది. ఆరోగ్యవంతమైన వ్యక్తికి ఇవి రెండు ప్రధానమే. ఇందులో ఏది తగ్గినా ఇబ్బందులు తప్పవు. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థతో మనం తిన్న ఆహారం అరుగుతుంది. అలాగే మంచి నిద్రతో రోగనిరోధక వ్యవస్థ పెరుగుతుంది. ప్రతి మనిషి రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్ర పోవాలి. లేకపోతే మన అవయవాలు సరిగా పనిచేయవు. రోగాలు చుట్టుముట్టే అవకాశాలుంటాయి. ఈ నేపథ్యంలో నిద్రను అసలు నిర్లక్ష్యం చేయకూడాదు. రోజు సమయానుకూలంగా నిద్ర పోయేందుకే ప్రయత్నించాలి. నిద్రతోనే మనకు అన్ని ఆరోగ్యాలు ప్రాప్తిస్తాయి.

మరిన్ని చదవండి:  వీటిని తింటే స్మెర్మ్ కౌంట్ పెరుగుతుందట..

సరైన నిద్ర లేకపోతే కళ్ల మీద ప్రభావం పడుతుంది. కంటి చూపు దెబ్బతినే అవకాశం ఉంది. తరువాత ఇతర అవయవాల మీద దెబ్బ పడుతుంది. యుక్త వయసులో ఉన్న వారిపై జరిపిన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. రోజుకు ఆరుగంటల కంటే ఎక్కువ సేపు నిద్రపోయే వారికి ఎలాంటి రోగాలు కనిపించలేదు. అదే ఓ గంట తక్కువ నిద్రపోయే వారికి పలు అనారోగ్య సమస్యలు కనిపించాయి. దీంతో నిద్ర మన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుందని గుర్తించారు.

అందుకే కంటి నిండ నిద్ర లేకపోతే ఇబ్బందులే. ఈ నేపథ్యంలో శరీరం పటిష్టంగా నిలవాలంటే నిద్ర కూడా ముఖ్యమే. కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర పోతే మెదడు బాగా పనిచేస్తుందని గుర్తించారు. నిద్రలేమి వల్ల డయాబెటిస్, రక్తపోటు వంటి రోగాలు వచ్చే ప్రమాదం పొంచి ఉంది. నిద్ర తక్కువగా పోయే వారికి మతిమరుపు సమస్య కూడా వస్తుంది. ఆలోచించే శక్తి తగ్గిపోతుంది. చురుకుదనం మందగిస్తుంది. ఇంకా గుండెపోటు, క్యాన్సర్ వచ్చే ముప్పు కూడా ఏర్పడుతుంది.

టీనేజీలో తగినంత నిద్ర లేకపోతే మల్టిపుల్ స్ల్కెరోసిస్ వ్యాధి సంక్రమించే అవకాశం ఉంటుంది. న్యూరాలజీ న్యూరోసర్జరీ అండ్ సైకియాట్రీ జర్నల్ లో ప్రచురితమైన కథనంలో ఈ విషయం చెప్పింది. మెదడు, వెన్నముక, నరాలు, కంటి నరాలను దెబ్బతీసే వ్యాధిగా గుర్తించారు. షిఫ్ట్ పద్ధతుల్లో పనిచేసే వారికి ఇది ఎక్కువగా ప్రభావం చూపుతుంది. టీనేజీలో ఉన్నవారు కనీసం రోజుకు 7-9 గంటలు నిద్రపోవడం వల్ల వీటి బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు. తక్కువ నిద్ర పోయే వారిలో 40 శాతం మందిలో ఈ లక్షణాలు కనిపించినట్లు గుర్తించారు.


మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

Leave a Comment