రాహుల్ పై ‘వారసత్వ’ ముద్ర పోయినట్లేనా

sadwik January 30, 2023
మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

 

Even though the Congress party is a national party, the leadership of the party is in the hands of the Gandhi family. The leaders of the Congress party strongly believe that no one but heirs can work for the post of president. Apart from PV Narasimha Rao in the middle, the Gandhi family continued to be the leaders until recently. Mallikarjuna Kharge was handed over the post of President after Sonia Gandhi was not in good health and Rahul Gandhi refused. But the Gandhi family is thinking of handing over the responsibilities to Rahul Gandhi again. By handing over the reins of the party to Kharge, a message has been sent to the country that a leader who does not belong to the Gandhi family will also be given the reins. 

Even if Rahul Gandhi took over as the president of the party, the party seniors did not accept him as a capable leader. According to that, there were negative election results. This situation brought a change in Rahul. They wanted to bring the Congress to power in the next election. He wanted to prove himself as a capable leader. That’s why they started a country-wide padayatra called “Bharat Jodo”. It ended in Jammu and Kashmir. Congress leaders are happy that Rahul Gandhi has given a clear answer to the criticism that the Congress party lacks proper leadership in the country.   

He recorded the record of being the first leader in the country to undertake a long journey. There is an opinion expressed in the ranks of the party that the critics have been silenced by the march. Senior leaders of the party say that Rahul Gandhi, who grew up like a prince, does not know the hardships of the people, and that the Bharat Jodoyatra has been able to refute the opposition’s criticism that he does not know politics. Will the march bring votes? Or? If we look at the matter… the ranks of that party are of the opinion that this march has proved that the country’s leader is there to save the Congress party. Priyanka Gandhi tweeted that Jodo Yatra… has spread the message of love in the country. 

Today is a memorable day in history. With the support of the countrymen, Bharat Jodo Yatra reached its final destination from Kanyakumari with great success. Priyanka said that the message of love has spread across the country. Rahul Gandhi’s march has also boosted the confidence of the people. Political observers believe that he has emerged as a qualified leader to take over the reins of the Congress party. Even if there were opportunities to take over the reins of the party, Rahul Gandhi, who had held organizational elections and handed over to a non-Gandhi family at the beginning of the Padayatra, naturally left for political experience.

Sources of the party expressed the opinion that with this padayatra, Rahul Gandhi is qualified to take over the reins of the party in the coming days. Leftist leaders in different states were brought together. He issued signals to keep personal differences aside and work for the party’s strength. In the rural areas, Rahul Gandhi was able to make a mark as a particularly popular leader by connecting with the people. Unity was developed in the ranks of the party as well. The long march from Kanyakumari to Srinagar in Kashmir made Rahul Gandhi a leader.

Rahul Gandhi, who has learned the politics of inheritance from the Gandhi family for years, has completed the Padayatra and has become a perfect political leader. He proved to be a determined leader to save the party. Congress leader Rahul Gandhi successfully completed the padayatra, which continued for more than 4 thousand kilometers. During the march, mother Sonia Gandhi and sister Priyanka Gandhi showed affection and affection towards Rahul Gandhi. Rahul Gandhi met people from all walks of life with Bharat Jodo Yatra. Political analysts are of the view that Rahul Gandhi, who grew up in air-conditioned rooms, sleeping in tents and starving outdoors, has brought about a transformation in Rahul Gandhi’s journey.

మరిన్ని చదవండి:  వారాహికి కొండగట్టు అంజన్న పూజ చేసిన "కర్మ"ను నమ్మిన పవన్ కళ్యాణ్

 


Rahul Gandhi’s stamp of ‘heritage’ is gone?

కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయినప్పటికీ ఆ పార్టీ నాయకత్వం గాంధీల కుటుంబం చేతుల్లోనే ఉంటుందని దేశమంతా తెలుసు. కాంగ్రెస్ పార్టీలో వారసులు తప్ప మరెవరూ అధ్యక్ష పదవికి పనికి రారని ఆ పార్టీ నాయకులే గట్టిగా నమ్ముతుంటారు. మధ్యలో పీవీ నరసింహా రావు తప్పించి మొన్నటి వరకు కూడా గాంధీ కుటుంబీకులే అధినేతలుగా కొనసాగారు. సోనియా గాంధీకి ఆరోగ్యం బాగా లేకపోవడం, రాహుల్ గాంధీ నిరాకరించడంతో అధ్యక్ష పదవిని మల్లికార్జున ఖర్గేకు అప్పగించారు. కానీ ఏనాటికైనా మళ్ళీ రాహుల్ గాంధీకే బాధ్యతలు అప్పగించాలని గాంధీ కుటుంబం ఆలోచిస్తోంది. ఖర్గేకు పార్టీ పగ్గాలు అప్పగించడంతో గాంధీ కుటుంబానికి చెందని నాయకుడికి కూడా పగ్గాలు ఇస్తారని దేశానికి మెసేజ్ పంపించారు.

రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నాఆయన్ని సమర్ధుడైన నాయకుడిగా పార్టీ సీనియర్లే ఒప్పుకోలేదు. దానికి తగ్గట్లు ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ఈ పరిస్థితి రాహుల్లో మార్పు తెచ్చింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని అనుకున్నారు. తనను తాను సమర్ధుడైన నాయకుడిగా నిరూపించుకోవాలకునుకున్నారు. అందుకే “భారత్ జోడో” పేరుతో దేశవ్యాప్త పాదయాత్ర చేశారు. అది జమ్మూ కాశ్మీర్ లో ముగిసింది. దేశంలో కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం లేదనే విమర్శలకు రాహుల్ గాంధీ నిఖార్సయిన సమాధానం ఇచ్చారని కాంగ్రెస్ నాయకులు సంతోషపడుతున్నారు.

దేశంలో తొలిసారిగా సుధీర్ఘ పాదయాత్ర చేపట్టిన నాయకుడిగా రికార్డు నమోదు చేశారు. పాదయాత్రతో విమర్శకుల నోళ్లను మూయించారని ఆ పార్టీ శ్రేణుల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకుమారుడిలా పెరిగిన రాహుల్ గాంధీకి ప్రజల కష్టనష్టాలు తెలియవని, రాజకీయాలు ఏం తెలుసనే విపక్షాల విమర్శలను భారత్ జోడోయాత్ర తిప్పికొట్టగలిగిందని ఆ పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు. పాదయాత్ర ఓట్లను కురిపిస్తుందా? లేదా? అనే విషయాన్ని పరిశీలిస్తే… కాంగ్రెస్ పార్టీని కాపాడుకోడానికి దేశ నాయకుడున్నాడని ఈ పాదయాత్ర నిరూపించిందని ఆ పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. జోడో యాత్ర… దేశంలో ప్రేమ సందేశాన్ని వ్యాప్తి చేసిందని ప్రియాంకాగాంధీ ట్వీట్‌ చేశారు.

ఈ రోజు చరిత్రలో గుర్తుండిపోయే రోజు. దేశపౌరుల మద్దతుతో భారత్‌ జోడో యాత్ర దిగ్విజయంగా కన్యాకుమారి నుంచి తుది గమ్యస్థానానికి చేరుకుంది. ప్రేమ సందేశం దేశమంతా వ్యాపించిందని ప్రియాంక తెలిపారు. రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రజల్లోనూ విశ్వాసం పెంపొందించింది. కాంగ్రెస్ పార్టీ పగ్గాలను చేపట్టేందుకు అర్హత సాధించిన నాయకుడిగా ఎదిగారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశాలు వచ్చినా.. పాదయాత్ర చేపట్టిన ప్రారంభ సమయంలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించి గాంధీయేతర కుటుంబానికి అప్పగించిన రాహుల్ గాంధీ రాజకీయ అనుభవంకోసం స్వతహాగా తప్పుకున్నారు.

రాబోయే రోజుల్లో పార్టీ పగ్గాలు చేపట్టేందుకు సమర్థనాయకుడు రాహుల్ గాంధీయేనని ఈ పాదయాత్రతో అర్హత సాధించారని ఆ పార్టీ వర్గాలు అభిప్రాయం వ్యక్తంచేశాయి. వివిధ రాష్ట్రాల్లో ఎడమొహం పెడమొహంతో ఉన్న నాయకులను ఏకతాటిపైకి తీసుకొచ్చారు. వ్యక్తిగత విభేధాలను పక్కనబెట్టి పార్టీ పటిష్టతకోసం పనిచేయాలనే సంకేతాలను జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలతో మమేకమై రాహుల్ గాంధీ ప్రత్యేక అభిమాన నాయకుడిగా ముద్ర వేసుకోగలిగారు. పార్టీ శ్రేణుల్లోనూ సమరోత్సాహాన్ని పెంపొందించారు. కన్యాకుమారినుంచి కాశ్మీర్ శ్రీనగర్ దాకా చేపట్టిన సుధీర్ఘ పాదయాత్ర రాహుల్ గాంధీని నాయకుడిగా తీర్చిదిద్దింది.

ఇన్నాళ్లు గాంధీ కుటుంబంనుంచి వచ్చిన వారసత్వ రాజకీయాన్ని పుణికి పుచ్చుకున్న రాహుల్ గాంధీ పాదయాత్ర పూర్తి చేసి పరిపూర్ణ రాజకీయ నాయకుడిగా నిలిచారు. పార్టీని కాపాడుకోడానికి నిఖార్సయిన నాయకుడని నిరూపించారు. దాదాపు 4 వేల కిలోమీటర్లకు పైగా కొనసాగించిన పాదయాత్రను కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ విజయవంతంగా పూర్తి చేశారు. పాదయాత్ర సాగుతున్న సమయంలో తల్లి సోనియాగాంధీ, సోదరి ప్రియాంకా గాంధీ రాహుల్ పట్ల ఆత్మీయత, ఆప్యాయతలను కనబరచారు. భారత్ జోడోయాత్రతో అన్నివర్గాల ప్రజలతో రాహుల్ గాంధీ మమేకమయ్యారు. ఏసీ గదుల్లో పెరిగిన రాహుల్ గాంధీ పాదయాత్రతో గుడారాల్లో నిద్ర, ఆరుబయట ఆకలి తీర్చుకున్న పరిస్థితులు రాహుల్ గాంధీలో పరివర్తన తీసుకొచ్చిందనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.


మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

Leave a Comment