Rajamouli Son Produces Aakashavani Movie from Showing Business

ఎస్ఎస్ రాజమౌళి అంటే పేరు కాదు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న టాలీవుడ్ బ్రాండ్. ఇప్పటిదాకా పరాజయమెరుగని దర్శకుడిగా అరుదైన ఘనతను సాధించిన జక్కన్న వారసుడు త్వరలో రంగంలో దూకబోతున్నాడు. కాకపోతే దర్శకుడిగా కాదు. మొదటి అడుగు నిర్మాతగా వేస్తున్నాడు. షోయింగ్ బిజినెస్ పతాకం మీద అశ్విన్ గంగరాజు ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆకాశవాణి పేరుతో ఇది రూపొందనుంది.

 

షూటింగ్ వచ్చే నెల ప్రారంభించబోతున్నారు. దీనికి మరో విశేషం కూడా ఉంది. కీరవాణి తనయుడు కాల భైరవ సంగీత దర్శకుడిగా దీని ద్వారానే పరిచయం కాబోతున్నాడు. ఇటీవలే పెనిమిటి పాట ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కాల భైరవ ఇప్పటికే ట్యూన్స్ కంపోజ్ చేయడం పూర్తయ్యిందని టాక్. దీనికి అందరు టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు.

 

Aakashavani Movie Details

 

Rajamouli Son Produces Aakashavani Movie from Showing Business

Rajamouli Son Produces Aakashavani Movie from Showing Business

ఆర్ఆర్ఆర్ కు సంభాషణలు రాస్తున్న సాయి మాధవ్ బుర్ర, ఎడిటింగ్ చేస్తున్న శ్రీకర్ ప్రసాద్ ఈ టీమ్ లో కూడా ఉన్నారు. ఒక్క కెమెరామెన్ సెంథిల్ తప్ప ఆర్ఆర్ఆర్ కు పనిచేస్తున్న కీలక వ్యక్తులందరూ ఆకాశ వాణి కోసం వర్క్ చేస్తున్నారు. ఆ మేరకు ముందే ఒప్పందం జరిగిందట. టైటిల్ ని పోస్టర్ ని బట్టి చూస్తే ఇదేదో ఫాంటసీ మూవీలా అనిపిస్తోంది.

 

కోయి మిల్ గయా ఛాయలు కొంత కనిపిస్తున్నా థీమ్ మాత్రం ఆసక్తికరంగా ఉంది, చాయ్ బిస్కెట్ తో పాపులర్ అయిన సందీప్ రాజ్ దీని ద్వారా సినిమా పరిశ్రమలో అడుగు పెడుతున్నాడు. కార్తికేయ పెళ్లయ్యాక రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏదో లవ్ స్టోరీ లాంటి రొటీన్ కాన్సెప్ట్ కాకుండా నాన్న ఆలోచనకు తగ్గట్టు భిన్నమైన కాన్సెప్ట్ ను ఎంచుకున్న కార్తికేయ మరో సంచలనం అవుతాడా వేచి చూడాలి.

Karthikeya Aakashavaani

Karthikeya Aakashavaani

 

Aakashavani Movie Cast & Crew

 

తెర వెనక

సౌండ్ డిజైన్‌: ర‌ఘునాథ్‌.కె

కాస్ట్యూమ్స్‌: సంజ‌నా శ్రీనివాస్‌
కాస్టింగ్ డైరెక్ట‌ర్‌: మ‌హ‌తి బిక్షు
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: మోహ‌న్ నాథ్ ఎస్‌.బింగి
లైన్ ప్రొడ్యూస‌ర్‌: శ‌శాంక్‌
స్క్రీన్ ప్లే: అశ్విన్ గంగ‌రాజు, సందీప్ రాజ్‌, సాయికుమార్ రెడ్డి
నిర్మాత‌: ఎస్‌.ఎస్‌.కార్తికేయ‌
ద‌ర్శ‌క‌త్వం: అశ్విన్ గంగ‌రాజు

 

టాలీవుడ్ టాప్ డైరెక్టర్, బాహుబలి లాంటి సెన్సేషనల్ సినిమాలను తెరకెక్కించిన రాజమౌళి ఫ్యామిలీలో నుంచి ఇప్పటి వరకు నిర్మాతలు లేరు. ఆ లోటును పూడుస్తూ ఆయన తనయుడు ఎస్ఎస్ కార్తికేయ సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు.

 

‘షోయింగ్ బిజినెస్’ పేరుతో సొంత బేనర్ స్థాపించిన కార్తికేయ… ఈ బేనర్లో తెరకెక్కించే తొలి చిత్రాన్ని ప్రకటించాడు. ‘ఆకాశవాణి’ పేరుతో తెరకెక్కే ఈ చిత్రం ద్వారా కొత్త దర్శకుడు అశ్విన్ గంగరాజు పరిచయం కాబోతున్నాడు. ఇతడు ఇంతకు ముందు బాహుబలి డైరెక్షన్ టీమ్‌లో పని చేయడం గమనార్హం.

 

అంతా రాజమౌళి ప్లానింగేనా?

ఎస్ఎస్ కార్తికేయ సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టడం… తండ్రి రాజమౌళి ప్లానింగేనా? అంటే కాదు అని అంటున్నారు వారి సన్నిహితులు. ఇదంతా రాజమళి భార్య రమ ప్లానింగ్ అని తెలుస్తోంది.

 

సంగీత దర్శకుడిగా కాలభైరవ ఎంట్రీ

ఎం.ఎం.కీర‌వాణి త‌న‌యుడు, సింగ‌ర్ కాల‌భైర‌వ ఈ చిత్రంతో సంగీత ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. చూస్తుంటే… ఈ సినిమా ద్వారా రాజమౌళి ఫ్యామిలీలోని యువతరంగం టాలెంటును వెలికితీసే ప్రయత్నం జరుగుతున్నట్లు కనిపిస్తోంది.

 

సినీయర్ ప్రముఖుల సపోర్ట్

ప్రముఖ ర‌చ‌యిత సాయిమాధ‌వ్ బుర్రా ఈ చిత్రానికి సంభాష‌ణ‌లు అందిస్తుండ‌గా, సురేశ్ ర‌గుతు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్ర‌హీత శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఈ చిత్రానికి ఎడిట‌ర్‌‌గా పని చేయబోతున్నారు.

 

సినిమా బ్యాక్ డ్రాప్ ఏమిటి?

రోటీన్ సినిమాలకు భిన్నంగా ‘ఆకాశవాణి’ సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఇదొక పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌తో తెర‌కెక్క‌బోయే ఈ చిత్రం అని తెలుస్తోంది. ఇంకా నటీనటుల ఎంపిక జరుగలేదు. జనవరి నుంచి షూటింగ్ మొదలు పెడతారట.

మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి . . . ! (కింద నంబర్స్ పేజెస్ ఉన్నాయా ఐతే ఇంకా చదవండి క్లిక్ చేయండి )
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •