పూర్తయన ..విధేయ రామ సంక్రాంతికి విడుదల చేస్తున్నారు – Ram Charan Tej Vinaya Vidheya Rama Movie Releasing on Sankranthi 2019

Vinaya Vidheya Rama movie :

రామ్‌చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘వినయ విధేయ రామ’. నిర్మాత దానయ్య డివివి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వాని హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రంలో ప్రశాంత్, ఆర్యన్ రాజేశ్, స్నేహ, వివేక్ ఒబెరాయ్ తదితరులు ప్రధాన తారాగణం. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను 2019 సంక్రాంతికి విడుదల చేస్తున్నారు.

 

Vinaya Vidheya Rama Movie

Vinaya Vidheya Rama Movie

Vinaya Vidheya Rama

 

టాకీపార్ట్ చిత్రీకరణ పూర్తయ్యింది. డిసెంబర్ 10 నుండి హైదరాబాద్‌లో భారీ సెట్‌లో పాటను చిత్రీకరించబోతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత డివివి దానయ్య మాట్లాడుతూ ‘రామ్‌చరణ్, బోయపాటి శ్రీను క్రేజీ కాంబినేషన్‌లో టైటిల్‌ను వినయ విధేయ రామ అని ప్రకటించగానే మంచి స్పందన వచ్చింది. దీపావళి సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా విషయానికి వస్తే టాకీ పార్ట్ పూర్తయ్యింది. హైదరాబాద్‌లో భారీ సెట్‌ను వేసి అందులో డిసెంబర్ 10 నుండి సాంగ్‌ను పిక్చరైజ్ చేయబోతున్నాం. మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్స్ జరుగుతున్నాయి.

అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి 2019 సంక్రాంతి కానుకగా సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేస్తున్నాం’ అన్నారు.

మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి . . . ! (కింద నంబర్స్ పేజెస్ ఉన్నాయా ఐతే ఇంకా చదవండి క్లిక్ చేయండి )
 •  
 • 3
 • 4
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  7
  Shares