రాత్రి కలలో దేవుడు చెప్పాడు – ఆర్జీవీ

sadwik January 29, 2023
మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

Ram Gopal Varma, who did not believe in God, saw God in his dream at night. He also said a good thing. That’s in his words…

“God told me in a night dream that Nadendla Manohar and Chandrababu will backstab Pawan Kalyan, just as Julius Caesar was backstabbed by Brutus, NTR by Nadendla Bhaskar Rao, and NTR by Chandrababu again.”

RGV revealed what God had told him in a dream. He also brought out another logic in this regard. He says that he said something in the past regarding Pawan and it came true.. so this will also happen.

“Dear Janasinikula, please tell our leader to stay away from Nadendla Manohar, the son of backbiter Nadendla Bhaskar Rao. Earlier I gave a similar warning about Raju Ravi Teja, who wrote the Pawanism book. My word came true.”

This is how Verma revealed his logic. Varma, who always responds to some topic on social media, calls himself a fan of Pawan Kalyan. While saying that, he criticizes him in his own style. Verma, who recently commented on ‘Varahi’, has now taken up the issue of back pain.


God said in a night dream – RGV

దేవుడ్ని నమ్మని రామ్ గోపాల్ వర్మకు, రాత్రి కలలో దేవుడు కనిపించాడట. పైగా ఓ మంచి విషయం కూడా చెప్పాడట. అదేంటో ఆయన మాటల్లోనే…

“ఆనాడు జూలియస్ సీజర్ ని బ్రూటస్, ఎన్టీఆర్ ని నాదెండ్ల భాస్కర్రావు, ఎన్టీఆర్ ని మళ్ళీ చంద్రబాబు వెన్నుపోటు పొడిచినట్టే.. ఈసారి పవన్ కల్యాణ్ ను నాదెండ్ల మనోహర్, చంద్రబాబు ఇద్దరూ కలిసి వెన్నుపోటు పొడుస్తారని నాకు రాత్రి కలలో దేవుడు చెప్పాడు”

ఇలా దేవుడు తనకు కలలో కనిపించి చెప్పిన విషయాన్ని బయటపెట్టాడు ఆర్జీవీ. దీనికి సంబంధించి మరో లాజిక్ ను కూడా ఆయన బయటకు తీశారు. పవన్ కు సంబంధించి గతంలో తను ఓ విషయాన్ని చెప్పానని, అది నిజమైందని.. కాబట్టి ఇది కూడా జరుగుతుందని చెబుతున్నాడు.

మరిన్ని చదవండి:  షారూఖ్ ఖాన్ తాజా చిత్రం 'పఠాన్' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో సరికొత్త రికార్డును నెలకొల్పింది

“ప్రియమైన జనసైనికులారా దయచేసి మన లీడర్ని, వెన్నుపోటు నాదెండ్ల భాస్కర్రావు కొడుకు నాదెండ్ల మనోహర్ కి దూరంగా ఉండమని చెప్పండి. ఇంతకు ముందు పవనిజం బుక్ రాసిన రాజు రవితేజ గురించి ఇలాగే వార్నింగ్ ఇచ్చాను. నా మాటే నిజమైంది.”

ఇలా తన లాజిక్ ను బయటపెట్టాడు వర్మ. నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక అంశంపై స్పందించే వర్మ, తననుతాను పవన్ కల్యాణ్ ఫ్యాన్ గా చెప్పుకుంటాడు. అలా చెప్పుకుంటూనే అతడిపై తనదైన శైలిలో విమర్శలు చేస్తుంటాడు. రీసెంట్ గా ‘వారాహి’పై వ్యాఖ్యలు చేసిన వర్మ, ఇప్పుడిలా వెన్నుపోటు అంశాన్ని ఎత్తుకున్నాడు.


మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

Leave a Comment