ఫస్ట్ నుంచి ప్రమోషన్లకు సమంత!

sadwik January 31, 2023
మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

Promotions are very important for Samantha’s prestigious mythological movie ‘Sakunthalam’. Since it is a heroine oriented film, Samantha’s promotions are crucial.

Due to her illness, Samantha could not do promotions for the movie Yashoda, which was released a few years ago. Could give a common interview. Samantha has promised the producers and directors that she will do strong promotions for Sakutalam.

To this extent, it seems that Samantha will join Sakunthalam promotions from February 1 onwards. Movie release on 17th. There will be a pre-release event in this. Also there are media meets. It seems that Samantha will attend all these too. Since it is being released as a Pan India film, one meet has to be held in other states as well. The movie is releasing in Telugu, Tamil, Kannada, Malayalam and Hindi languages.

Samantha who is currently in Mumbai will soon come to Hyderabad. The budget of Shakunthalam movie is around 80 crores. Therefore, a good opening should come. For that to happen, the publicity has to be strong.

 


Samantha for promotions from the first!

సమంత నటించిన ప్రెస్టీజియస్ మైధలాజికల్ సినిమా ‘శాకుంతలం’ ఈ సినిమాకు ప్రమోషన్లు చాలా కీలకం. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా కనుక సమంత చేసే ప్రమోషన్లే కీలకం.

కొన్నాళ్ల క్రితం విడుదలయిన యశోద సినిమాకు తన అనారోగ్యం కారణంగా సమంత ప్రమోషన్లు చేయడం కుదరలేదు. ఒక కామన్ ఇంటర్వూ ఇవ్వగలిగారు. శాకుతలం సినిమాకు తాను గట్టిగా ప్రమోషన్లు చేస్తానని సమంత నిర్మాత, దర్శకులకు మాట ఇచ్చి వున్నారు.

ఈ మేరకు ఫిబ్రవరి 1 తరువాత నుంచి సమంత శాకుంతలం ప్రమోషన్లలో జాయిన్ అవుతారని తెలుస్తోంది. సినిమా విడుదల 17న. ఈ లోగా ప్రీ రిలీజ్ ఈవెంట్ వుంటుంది. అలాగే మీడియా మీట్ లు వుంటాయి. వీటన్నింటికీ కూడా సమంత హాజరవుతారని తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమాగా విడుదల చేస్తున్నారు కనుక, ఇతర రాష్ట్రాల్లో కూడా ఒక్కో మీట్ నిర్వహించాల్సి వుంటుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదలవుతోంది.

మరిన్ని చదవండి:  668 కోట్లు.. పోస్ట్ కోవిడ్ లో అతి పెద్ద హిట్!

ప్రస్తుతం ముంబాయిలో వున్న సమంత త్వరలోనే హైదరాబాద్ వస్తారు. శాకుంతలం సినిమా కు దాదాపు 80 కోట్లు బడ్జెట్ ఖర్చు చేసారు. అందువల్ల మంచి ఓపెనింగ్ రావాల్సి వుంటుంది. అలా రావాలంటే పబ్లిసిటీ గట్టిగా జరగాల్సి వుంటుంది.


మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

Leave a Comment