ఎస్వీ రంగారావు బయోపిక్ ని ప్రొడ్యూస్ చేయనున్న కృష్ణం రాజు – Soon SV Rangarao Biopic in the Theatres

SV Rangarao Biopic in the Theatres, Produced by Krishnam raju

 

రెబెల్ స్టార్ కృష్ణం రాజు గతంలో వరుస హిట్స్ తో టాలీవుడ్ లో అగ్రహీరోల్లో ఒకరిగా ఉన్నారు. కృష్ణం రాజు ఇటీవలే తన పుట్టిన రోజు సెలబ్రేషన్స్ ని ప్రభాస్ తో, తన అభిమానులతో కలిసి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఇక ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా కృష్ణం రాజు మాట్లాడుతూ ఒక బయోపిక్ గురించి మాట్లాడాడు.

 

కృష్ణం రాజు కి మహానటుడు ఎస్వీ రంగారావు బయోపిక్ చూడాలని ఉందట. అసలు బయోపిక్స్ పై కృష్ణం రాజుకి ఆసక్తి ఎందుకు వచ్చింది అంటే, “మహానటి” సినిమా రిలీజ్ అయినప్పుడు కృష్ణం రాజు ఆ సినిమాని చూసి చాలా ఎంజాయ్ చేసాడట. సావిత్రి జీవితాన్ని కళ్ళకి కట్టినట్టు చూపించడం కృష్ణం రాజుకి ఎంతో బాగా నచ్చిందట.

 

sv-rango-rao

 

ఇప్పుడు ఎస్వీ రంగారావు బయోపిక్ కూడా అలానే చేస్తే బాగుంటుంది. ఈ బయోపిక్ లో ప్రకాష్ రాజ్ నటిస్తే చాలా బాగుంటుందని అన్నారు. దీన్ని బట్టి చూస్తుంటే అతి త్వరలో తన గోపి క్రిష్ణ బ్యానర్ లో కృష్ణం రాజే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసేలాగా కనిపిస్తున్నాడు.

మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి . . . ! (కింద నంబర్స్ పేజెస్ ఉన్నాయా ఐతే ఇంకా చదవండి క్లిక్ చేయండి )
 •  
 • 16
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  16
  Shares