సుబ్రహ్మణ్యపురం ట్రైలర్: దేవుడి మహిమా.. లేక మానవ మేధస్సా – Subramanyapuram Movie Trailer

సుబ్రహ్మణ్యపురం ట్రైలర్: దేవుడి మహిమా.. లేక మానవ మేధస్సా – Subramanyapuram Movie Trailer

 

సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’ ఈ సినిమాలో సుమంత్ సరసన ఈషా రెబ్బ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ చిత్రంపై అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు.

 

subramanyapuram movie trailer

subramanyapuram movie trailer

 

సుబ్రహ్మణ్యపురం అనే ఊరిలో ఉన్న ఓ దేవాలయంలో అంతుచిక్కని మిస్టరీని చేధించే డిటెక్టివ్ పాత్రలో సుమంత్ మనకు ఈ ట్రైలర్‌లో కనిపిస్తున్నారు. ”చనిపోయే ముందు ఏం కనిపించింది” అంటూ ఈ ట్రైలర్‌లో సుమంత్ చెప్పిన కొన్ని డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం సుమంత్‌కు 25వ చిత్రం కావడం విశేషం. సుధాకర్ ఇంప్లెక్స్ ఐపీఎల్ బ్యానర్‌పై బీరమ్ సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ.. ”భక్తి ప్రధాన ఇతివృత్తంతో సాగే మిస్టరీ థ్రిల్లర్ చిత్రమిది. గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యముంటుంది. నా సినీ ప్రయాణంలో మైలురాయిగా నిలుస్తుందనే నమ్మకముంది. విజయదశమి కానుకగా విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. టీజర్‌ని పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు..” అని తెలిపారు.

నిర్మాత బీరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ”సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న ఇరవై ఐదవ చిత్రమిది. ఆయన కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాం. తాజాగా విడుదలైన టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. సుదీర్ఘ విరామం తర్వాత ఎస్.పి బాలసుబ్రహ్మణ్యంగారు ఈ సినిమాలో ఓ గీతాన్ని ఆలపించడం గమనార్హం. ఈ పాట చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. మధుర ఆడియో ద్వారా చిత్ర గీతాలను త్వరలోనే విడుదల చేయనున్నాం..” అని అన్నారు.

 

మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి . . . ! (కింద నంబర్స్ పేజెస్ ఉన్నాయా ఐతే ఇంకా చదవండి క్లిక్ చేయండి )
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •