పవన్ కు నో చెప్పిన నిర్మాత?

sadwik January 28, 2023
మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

Will there be people who don’t want to worship if a top hero calls and makes a film? But if Pawan Kalyan offers this, a producer says that he cannot do it now. 

In Tollywood, Pawan Kalyan’s behavior is being heavily commented on. For years, the directors are being made to sit like that and they are playing with their lives, and if they don’t like it, they have to tell them to make another film, but they are not made to sit like that and deprive them of income.

There is a talk that for almost four to five years Maithri company has given an advance of more than 40 crores to Pawan and is waiting by collecting interest. Producer AM Ratnam’s film is running worse than a snail. People’s Media Cinema and DVV Danayya Cinema are like that. It seems that while all this was going on, Pawan called a producer and asked him to perform pooja. The producer has been with Pawan since 2014. It is said that a lot of investments have been made.

But even if Pawan said that, it seems that he is not in good health right now and he can’t do it now. Comments are being heard that the producer who sees the way of making Pawan’s films is like that.


The producer who said no to Pawan?

 

టాప్ హీరో పిలిచి సినిమా చేస్తా పూజ చేసుకో అంటే వద్దు అనేవాళ్లు వుంటారా? కానీ పవన్ కళ్యాణ్ ఇలా ఆఫర్ ఇస్తే ఓ నిర్మాత ఇప్పుడు తనకు కుదరదు అని చెప్పినట్లు బోగట్టా.

టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ తీరు పట్ల విపరీతంగా కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏళ్లు పూళ్లుగా దర్శకులను అలా కూర్చోపెట్టి, వాళ్ల జీవితాలతో ఆడుకుంటున్నారని, ఇష్టం లేకపోతే వేరే సినిమా చేసుకోమని చెప్పాలి కానీ వాళ్లను అలా కూర్చోపెట్టి, వాళ్లకి ఆదాయం లేకుండా చేయడం కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరిన్ని చదవండి:  31న నాని కొత్త సినిమాకు శ్రీకారం

దాదాపు నాలుగైదేళ్లుగా మైత్రీ సంస్థ నలభై కోట్లకు పైగానే పవన్ కు అడ్వాన్స్ ఇచ్చి, వడ్డీలు కట్టుకుంటూ వెయిటింగ్ లో వుందనే టాక్ వుంది. నిర్మాత ఎఎమ్ రత్నం సినిమా అలా నత్త కన్నా దారుణంగా నడుస్తోంది. పీపుల్స్ మీడియా సినిమా, డివివి దానయ్య సినిమా అలా వున్నాయి. ఇవన్నీ ఇలా వుండగానే పవన్ ఓ నిర్మాతను పిలిచి పూజ చేసుకోమని చెప్పినట్లు తెలుస్తోంది. ఆ నిర్మాత 2014 నుంచి పవన్ తో వున్నారు. చాలా పెట్టుబడులు పెట్టారు అని టాక్.

కానీ పవన్ అలా చెప్పినా, ప్రస్తుతం తనకు ఆరోగ్యం బాగా లేదని, ఇప్పుడు తాను చేయలేనని చెప్పి తప్పుకున్నట్లు తెలుస్తోంది. పవన్ సినిమాల మేకింగ్ తీరు చూసే ఆ నిర్మాత అలా అని వుంటారనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.


మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

Leave a Comment