It is known that Pawan Kalyan is going to make a film under the direction of Sujeeth. Today this movie officially started. Allu Aravind, Dil Raju, Suresh Babu and many celebrities came to the opening of this movie. Produced by DVV Danayya.
The title of this movie is fixed as OG. But this is only a working title. Meanwhile, there is a strong campaign that Anirudh will be hired as the music director for this gangster film. But, this movie got into Taman’s account.
Yes.. Taman is going to compose music for Pawan-Sujeeth movie. Earlier, Thamane composed the music for Pawan starrer Vakil Saab and Bheemlanayak. Now Ozzy has also joined his account.
In fact, there was a strong discussion on social media that Anirudh would be better for such stories. The background score given by Anirudh became the backbone of Vikram’s movie. Along with him, names like Santhosh Narayanan and Devisree Prasad also appeared on the screen.
But all together once again voted for Taman Ke. It seems that Pawan Kalyan and director Sujeeth have also favored Taman in this matter. Thaman, who is currently in good form, is giving a good background score along with the songs.
This movie also went to Taman’s account..!
సుజీత్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ ఓ సినిమా చేయబోతున్నాడనే సంగతి తెలిసిందే. ఈరోజు ఈ సినిమా లాంఛనంగా మొదలైంది. అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబుతో పాటు చాలామంది ప్రముఖులు ఈ సినిమా ఓపెనింగ్ కు వచ్చారు. డీవీవీ దానయ్య నిర్మాత.
ఈ సినిమాకు OG అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే ఇది వర్కింగ్ టైటిల్ మాత్రమే. ఇదిలా ఉండగా.. గ్యాంగ్ స్టర్ కథతో వస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ ను సంగీత దర్శకుడిగా తీసుకుంటారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ, ఈ సినిమా తమన్ ఖాతాలోకి చేరింది.
అవును.. పవన్-సుజీత్ సినిమాకు తమన్ సంగీతం అందించబోతున్నాడు. ఇంతకుముందు పవన్ నటించిన వకీల్ సాబ్, భీమ్లానాయక్ సినిమాలకు తమనే సంగీతం అందించాడు. ఇప్పుడీ ఓజీ కూడా అతడి ఖాతాలోకే చేరింది.
నిజానికి ఇలాంటి కథలకు అనిరుధ్ అయితే బాగుంటుందనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా నడిచింది. విక్రమ్ సినిమాకు అనిరుధ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బ్యాక్ బోన్ గా నిలిచింది. అతడితో పాటు సంతోష్ నారాయణన్, దేవిశ్రీ ప్రసాద్ లాంటి పేర్లు కూడా తెరపైకొచ్చాయి.
కానీ అంతా కలిసి మరోసారి తమన్ కే ఓటేశారు. ఈ విషయంలో పవన్ కల్యాణ్, దర్శకుడు సుజీత్ కూడా తమన్ వైపు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న తమన్, పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా ఇస్తున్నాడు.