Warangal Lovers Caught redhanded in S2 Cinema Hall in the Hands of Lady’s Father – ప్రియుడితో సినిమాకు వచ్చి తండ్రి చేతిలో తన్నులు తిన్న ప్రేమ జంట

Warangal Lovers Caught redhanded in S2 Cinema Hall in the Hands of Lady’s Father – ప్రియుడితో సినిమాకు వచ్చి తండ్రి చేతిలో తన్నులు తిన్న ప్రేమ జంట

 

చదువుకోమని పిల్లలపై నమ్మకం పెట్టి కాలేజీలకు పంపిస్తే ప్రేమికుడితో కలిసి సినిమాకు వచ్చిందో యువతి. అంతేకాదు అనూహ్యంగా తండ్రికి దొరికింది. దీనితో తండ్రికి ఒళ్ళు మండి ఆమెను చితకబాదాడు. కాగా, ఈ ఘటన వరంగల్ లో s2 సినిమా హాల్ దగ్గర చోటు చేసుకుంది. పండగ సీజన్, వీకెండ్ కావడంతో ప్రేమికులిద్దరు సరదాగా గడిపేందుకు సినిమాకు వచ్చారు. అలా టికెట్ తీసుకుని సినిమా హాల్లోకి వెళ్లారు. కానీ, అంతలోనే సీన్ కాస్త రివర్స్ అయింది.

 

 

అదే సినిమాకు యువతి తండ్రి అదే హాల్ లో ఇంకా చెప్పాలంటే వెనకాలే కూర్చున్నాడు. అయితే కొద్ది సేపటి తరువాత ముందు కూర్చున్న యువతి తన కూతురేనని గుర్తించాడు. అంతే తన కూతురు ప్రేమికుడితో కలిసి సినిమాకు వచ్చిందన్న కోపాన్ని తట్టుకోలేక, వెంటనే కూతురిని బయటవరకు ఈడ్చుకొచ్చి తీవ్రంగా కొట్టాడు. చదువుకోమని పంపిస్తే లవర్ తో సినిమాలకు, షికార్లకు వస్తావా అంటూ కూతురును చావబాదాడు. ఈ క్రమంలో అడ్డువచ్చిన ప్రేమికుడిని కూడా చితక్కొట్టాడు. కాగా స్థానికులు అడ్డుకున్నారు.

 

warangal lovers caught in cinema hall

కాగా ఈ విషయంపై పోలీసులకు పిర్యాదు చేయగా వారు దర్యాప్తు చేపట్టారు. కాగా దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


 

మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి . . . ! (కింద నంబర్స్ పేజెస్ ఉన్నాయా ఐతే ఇంకా చదవండి క్లిక్ చేయండి )
  •  
  • 58
  • 20
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    78
    Shares