What is Indoor Maps in Find my Device App – గూగుల్‌ ‘ఫైండ్‌ మై డివైస్‌’ యాప్‌లో తాజాగా ‘ఇండోర్‌ మ్యాప్స్‌’ అనే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది

గూగుల్‌ ‘ఫైండ్‌ మై డివైస్‌’ యాప్‌లో తాజాగా ‘ఇండోర్‌ మ్యాప్స్‌’ అనే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా పెద్ద భవనాల్లో స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కడ వదిలేశామో తెలుసుకొనే వీలుంది.

 

”ఫైండ్‌ మై డివైజ్‌ యాప్‌ ద్వారా మన ఫోన్‌ ఎక్కడుందో కనుక్కోవచ్చు. మనకు ఫోన్‌ దొరికే వరకూ దాన్ని లాక్‌ చేసి ఉంచొచ్చు. ఈ యాప్‌లోని ఇండోర్‌ మ్యాప్స్‌ సహాయంతో ఫోన్‌ ఎక్కడ ఉందో సూచికల సహాయంతో కనుగొనవచ్చు. ముఖ్యంగా విమానాశ్రయాలు, షాపింగ్‌ మాల్స్‌, ఇతర పెద్ద పెద్ద భవనాల్లో ఫోన్‌ వెతుక్కొనేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది” అని ప్లే స్టోర్‌లో ఈ యాప్‌ డిస్క్రిప్షన్‌లో రాశారు.

What is Indoor Maps in Find my Device App

What is Indoor Maps in Find my Device App

 

అయితే ఈ ఇండోర్‌ మ్యాప్స్‌ ఫీచర్‌ ఇంకా ఏ తరహా భవనాలకు వర్తిస్తుందో గూగుల్‌ వెల్లడించలేదు.

 

గతేడాది మేలో ‘ఫైండ్‌ మై డివైజ్‌’ యాప్‌ విడుదలైంది. ఈ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసి ఉన్న ఫోన్‌ ఎక్కడైనా వదిలేస్తే మరొక ఫోన్‌ నుంచి ఇది ఎక్కడుందో కనుగొనవచ్చు. మనం ఆఖరుగా ఫోన్‌ ఉపయోగించిన లొకేషన్‌, ప్రస్తుత లొకేషన్‌ ఆధారంగా గూగుల్‌ మ్యాప్స్‌లో నేవిగేషన్‌ చూపిస్తుంది. ఒకవేళ ఫోన్‌ సైలెంట్‌లో ఉన్నా పెద్ద శబ్దం చేస్తుంది. ఒక మెసేజ్ పంపి ఫోన్‌ను లాక్‌ చేయొచ్చు. మనల్ని సంప్రదించాల్సిన ఫోన్‌ నెంబరును లాక్‌ స్ర్కీన్‌పై డిస్‌ప్లే అయ్యేలా చేయొచ్చు.

మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి . . . ! (కింద నంబర్స్ పేజెస్ ఉన్నాయా ఐతే ఇంకా చదవండి క్లిక్ చేయండి )
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •