ఈ ఏడాది ఫిబ్రవరి సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?

sadwik February 1, 2023
మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

February box office has something special. The buzz of Sankranti movies ends. The discussion of summer movies begins. February box office will be during this period. However, an unexpected success appears every year in this month. This magic has been repeating itself for the past three years.

For example, if we take February last year, DJ Tillu’s surprise hit. In February 2021, Zombie Reddy received an unexpected success. In February 2020, Nitin received a huge success with Bhishma. Every year, a super hit happens in February. And which movie will repeat that magic this year and this month?

Movies like Writer Padmabhushan, Michael, Buttabomma are releasing in the first week of February. There are expectations on these 3 movies. In the color photo range, this time Suhas is hitting a hit with writer Padmabhushan. With confidence in the content, paid previews are also starting a day before the release.

Sandeep Kishan, however, has set unprecedented expectations on Michael’s film. This is the first Pan India movie in his career. Casting a star like Vijay Sethupathi boosted Sandeep Kishan’s confidence. Buttabomma is coming under the banner of Sitara Entertainments as a remake of the super hit movie in Malayalam. The sentiment of February with DJ Tillu caught them well.

Kalyan Ram starrer Amigos is coming in the second week. After a blockbuster like Bimbisara, this is the film coming from this hero, so the expectations are high. This is the movie where Kalyan Ram played a triple role for the first time in his career. The teaser has already received a good response.

Sir, Vinarobhagyamu Vishnu Katha and Das Ka Dhamki movies are also releasing in February. Dhanush starrer straight Telugu movie Sir. Directed by Venky Atluri, there are moderate expectations on this movie. There are also speculations about Kiran Abbaravam’s Vinoro Bhagyamu Vishnu Katha movie coming from Geetha Compound.

Along with these, Vishwak Sen’s self-directed film Das Ka Dhamki is also coming in February itself. Along with the trailer of this movie, the songs clicked. With this, everyone’s attention fell on this threat.

Apart from these films, Shakunthalam, in which Samantha played the lead role, is also scheduled for February release, but the release date is likely to change in view of the latest developments.

Overall, few movies queued up in February with moderate to huge expectations. It is interesting to see which movie repeats the ‘February magic’.

 


Will the February sentiment be repeated this year?

ఫిబ్రవరి బాక్సాఫీస్ కు ఓ ప్రత్యేకత ఉంది. సంక్రాంతి సినిమాల సందడి ముగుస్తుంది. సమ్మర్ సినిమాల చర్చ మొదలవుతుంది. ఈ సంధి కాలంలో ఉంటుంది ఫిబ్రవరి బాక్సాఫీస్. అయినప్పటికీ ఈ నెలలో ఊహించని సక్సెస్ ఒకటి ఏటా కనిపిస్తూనే ఉంటుంది. గడిచిన మూడేళ్లుగా ఈ మేజిక్ రిపీట్ అవుతూనే ఉంది.

మరిన్ని చదవండి:  గాడ్ ఫాదర్ సినిమా తో చిరంజీవి స్థాయిని నిలుపుకుంటాడు

ఉదాహరణకు గతేడాది ఫిబ్రవరినే తీసుకుంటే డీజే టిల్లూ సర్ ప్రైజ్ హిట్టయింది. ఇక 2021 ఫిబ్రవరిలో జాంబీ రెడ్డి ఊహించని సక్సెస్ అందుకోగా.. 2020 ఫిబ్రవరిలో భీష్మతో భారీ విజయం అందుకున్నాడు నితిన్. ఇలా ఏటా ఫిబ్రవరిలో ఓ సూపర్ హిట్ పడుతోంది. మరి ఈ ఏడాది, ఈ నెలలో ఆ మేజిక్ రిపీట్ చేసే సినిమా ఏది?

ఫిబ్రవరి మొదటి వారంలో రైటర్ పద్మభూషణ్, మైఖేల్, బుట్టబొమ్మ లాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ 3 సినిమాలపై అంచనాలున్నాయి. కలర్ ఫొటో రేంజ్ లో ఈసారి రైటర్ పద్మభూషణ్ తో సుహాస్ హిట్ కొడతాడంటున్నారు కొంతమంది. కంటెంట్ పై నమ్మకంతో రిలీజ్ కు ఒక రోజు ముందు నుంచే పెయిడ్ ప్రివ్యూలు కూడా స్టార్ట్ చేస్తున్నారు.

ఇక సందీప్ కిషన్ అయితే మైఖేల్ సినిమాపై ఎన్నడూలేని స్థాయిలో అంచనాలు పెట్టుకున్నాడు. అతడి కెరీర్ లో తొలి పాన్ ఇండియా మూవీ ఇది. విజయ్ సేతుపతి లాంటి స్టార్ నటించడం సందీప్ కిషన్ నమ్మకాన్ని మరింత పెంచింది. ఇక మలయాళంలో సూపర్ హిట్టయిన సినిమాకు రీమేక్ గా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వస్తోంది బుట్టబొమ్మ. డీజే టిల్లూతో ఫిబ్రవరి సెంటిమెంట్ వీళ్లకు బాగా పట్టుకుంది.

రెండో వారంలో కల్యాణ్ రామ్ నటించిన అమిగోస్ వస్తోంది. బింబిసార లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ హీరో నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు గట్టిగా ఉన్నాయి. కెరీర్ లో తొలిసారి కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేసిన సినిమా ఇది. టీజర్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది.

సర్, వినరోభాగ్యము విష్ణుకథ, దాస్ కా ధమ్కీ సినిమాలు కూడా ఫిబ్రవరిలోనే వస్తున్నాయి. ధనుష్ నటించిన స్ట్రయిట్ తెలుగు సినిమా సర్. వెంకీ అట్లూరి డైరక్ట్ చేసిన ఈ సినిమాపై ఓ మోస్తరు అంచనాలున్నాయి. అటు గీతా కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమాగా కిరణ్ అబ్బరవం నటించిన వినోరో భాగ్యము విష్ణుకథ సినిమాపై కూడా అంచనాలున్నాయి.

వీటితో పాటు స్వీయదర్శకత్వంలో విశ్వక్ సేన్ నటించిన దాస్ కా ధమ్కీ సినిమా కూడా ఫిబ్రవరిలోనే వస్తోంది. ఈ సినిమా ట్రయిలర్ తో పాటు, సాంగ్స్ క్లిక్ అయ్యాయి. దీంతో అందరి దృష్టి ఈ ధమ్కీపై పడింది.

ఈ సినిమాలతో పాటు సమంత లీడ్ రోల్ పోషించిన శాకుంతలం సినిమా కూడా ఫిబ్రవరి రిలీజ్ కోసం షెడ్యూల్ అయినప్పటికీ, తాజా పరిణామాల నేపథ్యంలో రిలీజ్ డేట్ మారే అవకాశం ఉంది.

మొత్తమ్మీద ఫిబ్రవరిలో ఓ మోస్తరు నుంచి భారీ అంచనాలతో కొన్ని సినిమాలు క్యూ కట్టాయి. వీటిలో ‘ఫిబ్రవరి మేజిక్’ ను రిపీట్ చేసే సినిమా ఏదనేది ఆసక్తికరంగా మారింది.


మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

Leave a Comment