అవి ఆయుర్వేదిక్‌ బీడీలు.. ‘గుంటూరు కారం’లో స్మోకింగ్‌పై మహేశ్‌

admin

guntur-karam-beedi

Guntur Kaaram: ఇటీవల విడుదలైన గుంటూరుకారం గురించి ఆ చిత్ర కథానాయకుడు మహేశ్‌బాబు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

మహేశ్‌బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). శ్రీలీల కథానాయిక. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్‌ను అలరిస్తూ, బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సందర్భంగా మహేశ్‌ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. గత చిత్రాలకు భిన్నంగా ఇందులో డ్యాన్స్‌ మూమెంట్స్‌ ఉండాలని ముందు నుంచే తానూ, దర్శకుడు త్రివిక్రమ్‌ అనుకున్నామని చెప్పారు. అందుకు తగినట్లుగానే రమణ (Mahesh babu) పాత్రకు అనుగుణంగా పాటలను డిజైన్‌ చేసుకున్నట్లు చెప్పారు.

guntur karam beedi

ఆ బీడీల్లో పొగాకు ఉండదు!

ఇక ఈ సినిమాలో మహేశ్‌ వరుసగా బీడీలు కాలుస్తూ కనిపించారు. దీనిపైనా ఆయన క్లారిటీ ఇచ్చారు. ‘‘నేను స్మోకింగ్‌ను అస్సలు ప్రోత్సాహించను. సినిమాలో బీడీ కాల్చడం వెనుక ఉన్న అసలు కథ ఇప్పుడు చెబుతా. అది ఒక ఆయుర్వేదిక్‌ బీడీ. లవంగం ఆకులతో తయారు చేశారు. మొదట నాకు నిజమైన బీడీ ఇచ్చారు. అది కాల్చినప్పుడు మైగ్రేన్‌ వచ్చి తల తిరిగిపోయేది. ఆ నొప్పి భరిస్తూ షూటింగ్‌లో పాల్గొనడం నా వల్ల కావటం లేదని త్రివిక్రమ్‌కు చెప్పా. ఆ మరుసటి రోజు నుంచి ఆయుర్వేదిక్‌ బీడీలు తయారు చేసి సెట్‌వాళ్లు తీసుకొచ్చారు. అందులో ఎలాంటి టుబాకో ఉండదు. మింట్ ఫ్లేవర్‌లో ఉండటంతో సౌకర్యవంతంగా షూటింగ్‌ చేసేందుకు వీలైంది’’

ఫస్ట్‌లుక్‌లో వేసుకున్న రెడ్‌ షర్ట్‌ అవుట్‌ ఆఫ్‌ స్టాక్‌

‘‘ఈ మూవీలో రెడ్‌ షర్ట్‌ వేసుకున్న స్టిల్‌ను ఫస్ట్‌లుక్‌గా విడుదల చేశారు. ఆ తర్వాత పది రోజుల పాటు ఆన్‌లైన్‌ స్టోర్స్‌లో ఆ షర్ట్‌ అవుట్‌ ఆఫ్ ఆర్డర్‌ చూపించిందని చాలా మంది నాతో చెప్పారు. అప్పటి నుంచి ప్రతిదీ ప్రత్యేకంగా ఉండాలని అనుకున్నాం. అలాగే డ్యాన్స్‌ల విషయంలోనూ ఇంతకు ముందెన్నడూ లేని విధంగా చేయాలనుకున్నాం. ‘పోకిరి’లో ‘దేవుడా దేవుడా’ సాంగ్‌లో నేను చూపించిన యాటిట్యూడ్‌ కావాలని త్రివిక్రమ్‌ అడిగారు. శేఖర్‌ మాస్టర్‌ కూడా అందుకు తగిన విధంగా స్టెప్స్‌ డిజైన్‌ చేయడంతో అదే యాటిట్యూడ్‌తో సాంగ్స్ తీయడం మొదలు పెట్టాం’’

‘‘కుర్చీ పాట’ డిసెంబరు 22న షూటింగ్‌ మొదలు పెట్టాం. చాలా టెన్షన్‌గా అనిపించింది. ఆ పాటను తెరపై చూసిన తర్వాత ‘నేనేనా’ అనిపించింది. ‘ఓ మై బేబీ’ పాటను కూడా కేరళలో తీద్దామని అనుకున్నాం. నాకు, శ్రీలీలకు నాలుగైదు డ్రెస్‌లను కూడా రెడీ చేశారు. మరుసటి రోజు షూటింగ్‌కు వెళ్దామని సిద్ధమవుతుండగా, చివరి నిమిషంలో వద్దనుకున్నాం. రమణ పాత్రను దృష్టిలో పెట్టుకుని రియల్‌టైమ్‌లో కాస్ట్యూమ్స్‌, పాటలను తీశాం. దీంతో సింగిల్‌ డ్రెస్‌లో పాట మొత్తం కనిపించినందుకు శ్రీలీల ఫీల్‌ అయింది. ఆ సాంగ్‌ కోసం తీసి పెట్టిన ఆరు డ్రెస్‌లను రీల్స్‌ కోసం వాడేసుకుంది’’ అని మహేశ్‌బాబు నవ్వుతూ ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకున్నారు.

About Author

Telugu News (తెలుగు న్యూస్)

తెలుగు వారికోసం తెలుగు న్యూస్ ఇవ్వడం కోసం - ఈ వెబ్సైటు ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రాంతీయం, రాజకీయం , సినిమా , క్రీడలు , మరియు తెలుగు వార్త సమాచారం అందిస్తాము. 

Leave a Comment